ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరోలు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జంట‌గా తెర‌కెక్కే మ‌ల్టీస్టార‌ర్ ఆర్ ఆర్ ఆర్‌. రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే ఈ ప్ర‌తిష్టాత్మ‌క సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులుగా ఈ సినిమా విష‌యంలో ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చిన రాజ‌మౌళి ఎట్ట‌కేల‌కు సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే యేడాది జ‌న‌వ‌రి 8వ తేదీన రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

 

టైటిల్ టీజర్ - రామ్ చరణ్ పాత్రకి సంబందించిన టీజర్ ని జక్కన్న ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చి సంబరపరిచారు. వీటిని చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమాకు మ‌రింత‌గా హాలీవుడ్ రేంజ్ తీసుకు వ‌చ్చేందుకు ఇటు బాలీవుడ్ స్టార్ల‌తో పాటు అటు హాలీవుడ్ కాస్టింగ్‌ను కూడా డిజైన్ చేశాడు. ఇక ఇప్పుడు లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్ ఆగిపోవ‌డంతో రాజ‌మౌళి మ‌రో పాత్ర కోసం మ‌ళ‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌ను ఎంపిక చేస్తున్నాడ‌ట‌. 

 

ఇక ఈ సినిమా కోసం ఎన్ని మార్పులు చేయాలి ?  ఎవ‌రెవ‌రిని ఎంపిక చేయాల‌న్న‌దానిపై క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రౌద్రం రణం రుధిరం సినిమా భీమ్ యుక్త వయసు నుండి మొదలవుతుంద‌ట‌. ఇక ఇప్ప‌టికే సినిమా టీజ‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్ పాత్ర వీడియోలు రావ‌డంతో ఇప్పుడు జ‌క్క‌న్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను బాగా టెన్ష‌న్ పెట్టేస్తున్నాడు. మే 20న ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ సంబంధించిన వీడియో కోసం అభిమానులు ఆసక్తిగా వేయికళ్లతో చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: