సొగసుంటే వయసుతో సంబంధం లేదు. సొగసు వయసు కలిస్తే పదహారు పరువాలు గుభాలిస్తాయి. మనసు, వయసు కలిస్తే ప్రేమ చిగురిస్తుంది. ఇక లేటు వయసులో మనసు మౌనగీతం పాడితే ఆ గొడవ  సంగతి చెప్పాల్సింది లేదు.

 

ఇవన్నీ ఎందుకంటే ఎర్లీ నైంటీస్ లో  లో రమ్య క్రిష్ణ తెలుగులో హాటీ బ్యూటీ . ఆమె గ్లామర్ తో వెండితెరను ఓ లెక్కన  రఫ్ఫాడించేసింది. రమ్య అందాలతో ఎన్నో సినిమాలు సూపర్ హిట్  చేయించింది. ఆమె ఉంటే చాలు కాసుల పంటేనన్న సీజన్ అప్పట్లో నడిచింది. రమ్య హీరోయిన్ నుంచి క్యారక్టర్ ఆర్టిస్టుగా మారినా కూడా ఆమె డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు.

 

ఇక రమ్య బాహుబలిలో అదుర్స్ అన్న లెక్కన నటించి ఆ సినిమా విజయంలో భాగమైంది. ఇదిలా ఉండగా రమ్య క్రిష్ణ లేటేస్ట్ గా పూరీ కొడుకు మూవీలో నటిస్తోంది. ఆమెను ఇపుడు ఒక మూవీలోకి తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.

 

బాలీవుడ్లో రెండేళ్ళ క్రితం రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన అంధాధూన్ మూవీని తెలుగులో హీరో నితిన్ తో రీమేక్ చేస్తున్న సంగతి విధితమే. ఈ మూవీలో హాట్ టాబు పాత్రకు గానూ రమ్యను తీసుకోవాలనుకుంటున్నారుట.  

 

ఈ మూవీలో టాబూ హాటేత్తించే తీరున నటించింది. ఇపుడు తెలుగులో అ  పాత్ర అయితే రమ్య ఎలా చేస్తుందో అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఎందుకంటే రమ్య ఇపుడు డిగ్నిఫైడ్ రోల్స్ కి మారిపోయారు. మరి ఆమె కనుక ఒప్పుకుంటే మాత్రం తెలుగు స్క్రీన్  మీద అలనాటి హాటీని మళ్ళీ ఇపుడు కూడా చూడొచ్చేమో.  

 

ఇదిలా ఉండగా తెలుగులో మంచి డిమాండ్ ఉన్న రమ్యను కనుక ఈ పాత్రకు తీసుకుంటే మాత్రం మంచి హైప్ రావడమే కాదు, మూవీ మీద పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: