ఒకప్పుడు బుల్లితెరపై సిరియల్ అంటే రామాయణం, మహాభారతం అనే చెప్పాలి.  టెలివిజన్ రంగంలో 80, 90వ దశకంలో ఈ సిరియల్స్ ని కోట్ల మంది ప్రేక్షకులు ఆదరించారు.  ఆదివారం వస్తే చాలు టీవిలకు అతుక్కు పోయేవారు.  ఇప్పటి వరకు వెండి తెరపై రామాయణ, మహాభారతం లాంటి పౌరాణిక గాధలపై ఎన్నో సినిమాలు వచ్చాయి..కానీ అప్పట్లో టెలివిజన్ లో వచ్చిన రామాయణం, మహాభారత్ సిరియల్స్ కి ఎంతో ఆదరణ లభించింది. అప్పటికీ, ఇప్పటికీ అదే ఆదరణ, అదే భక్తి వాత్సల్యం. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో ఇప్పటికే సినిమాలు, సీరియళ్లు, వీడియోగేమ్‌లు, అమెజాన్‌ప్రైమ్‌లు..అబ్బో చాలానే వచ్చేశాయి. కానీ ఇప్పటికీ అలాంటి సీరియల్స్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తూనే ఉంటుంది.  

 

తాజాగా ఒకప్పుడు బుల్లితెరపై సెన్సేషన్ సృష్టించిన రామాయణం మళ్లీ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.   ప్రస్తుతం  రామానంద్‌సాగర్, బిఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన రామాయణ్‌, మహాభారత్ సీరియళ్లకు భారీ ఆదరణ లభిస్తోంది.  దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న ఈ సీరియల్స్ మొదటి నాలుగు ఎపిసోడ్‌లకు 170 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు బార్క్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆదివారం ప్రసారమైన ఒక్క ఎపిసోడ్‌కే 5కోట్ల వ్యూయర్‌షిప్ నమోదైంది. దీంతో డీడీ ఛానల్ వ్యూయర్‌షిప్ అమాంతం పెరిగింది.

 

దీంతో డీడీ ఛానల్‌కి మునుపెన్నడూ లేనంతగా 650 శాతం లాభాల్లో దూసుకుపోయింది.  తాజాగా ఈ విషయం పై సీఈవో శశి శేఖర్ మాట్లాడుతూ.. నిజంగా ఇదో గొప్ప శుభసూచికం.. భారతీయులు ఇప్పటికీ ఇంత గొప్ప సీరియల్స్ ని ఆదరించడం నిజంగా గర్వించదగ్గ విషయం అన్నారు. మీ అందరి మద్దతుకు కృతఙ్ఞతలు. ఇంట్లోనే ఉండండి. సురక్షితంగా ఉండండి "అంటూ సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశారు. మార్చి 28న రీ టెలికాస్ట్ అయిన ఈ సీరియల్స్‌..పాత రికార్డులను బద్దలుకొడుతూ కొత్త రికార్డులను సెట్‌చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: