మెగా హీరోలతో సినిమా చేస్తే ఆ హీరోయిన్ కు మంచి క్రేజ్ ఉంటుంది. ఒకరు కాకున్నా మరొకరు ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటారు. మెగా హీరోతో సినిమా హిట్టు పడితే ఆ హీరోయిన్ కు  వరుస ఛాన్సులు వస్తాయి. ఇక మెగాస్టార్, పవర్ స్టార్ సినిమా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. సీనియర్ స్టార్స్ కు హీరోయిన్ గా చేయాలంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. 

 

చిరుతో ఖైదీ నంబర్ 150లో కాజల్ హీరోయిన్ గా నటించింది.. రీ ఎంట్రీతో చిరుకు సూపర్ హిట్ ఇవ్వగా పవర్ స్టార్ తో సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా కాజల్ హీరోయిన్ గా నటించింది. అయితే చిరుకి హిట్ ఇచ్చిన ఈ అమ్మడు పవన్ తో ఫ్లాప్ అందుకుంది. అయితే మరోసారి ఆ ఇద్దరితో కాజల్ జోడీ కడుతుంది. చిరు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాకు కాజల్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేయగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమాకు కూడా ఆమెను తీసుకున్నారని తెలుస్తుంది. 

 

గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ తో పవన్ సినిమా అనగానే ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పవన్ తో కాజల్ ఒకసారి ఫ్లాప్ అవగా రెండోసారి చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. చిరు, పవన్ ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి ఒక హీరోయిన్ తో జత కడుతున్నారు. ఈ సినిమాలతో మరో మూడు నాలుగేళ్లు కాజల్ టాలీవుడ్ లో తన సత్తా చాటేలా ఉంది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే కాజల్ మాత్రం తెలుగులో వరుస ఛాన్సులు అందుకుంటుంది. మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాలతో అమ్మడు మరింత బిజీ కానుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: