టాలీవుడ్ హీరో తనీష్.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. దేవుళ్ళు సినిమాతో బాల‌న‌టుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈయ‌న ప్రేమంటే ఇదేరా, మన్మథుడు, రైడ్ తదితర చిత్రాల్లో న‌టించాడు. అలాగే కృష్ణవంశీ రూపొందించిన నక్షత్రం సినిమాలో నెగెటివ్ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్ లోనూ త‌నిష్ న‌టించాడు. ఇలా ఇండస్ట్రీలో చిన్నచితకా పాతికపైగా చిత్రాల్లో నటించిన తనీష్‌కి హీరోగా స్టార్ డమ్ మాత్రం రాలేదు. అయితే కెరియర్ పరంగా సరైన హిట్ పడకపోయినప్పటికీ బిగ్ బాస్ సీజన్ 2 రియాలిటీ షో ద్వారా పాపులర్ అయ్యారు తనీష్. 

IHG

ఇందులో ఫైనల్ కంటెస్టెంట్ కౌశల్‌కి గట్టిపోటీ ఇచ్చారు. ఆ షో విన్నర్ కౌశల్‌‌తో సై అంటే సై అనేవాడు. ఫైనల్ వరకూ ఈ ఇద్దరి మధ్య మధ్య టఫ్ ఫైట్ నడిచింది. తిట్టుకుంటూ.. కొట్టుకుంటూ షోని రక్తికట్టించారు ఇద్దరూ. అప్ప‌ట్లో తనీష్ గ్యాంగ్ ఓ వైపు, కౌశల్ ఒక్కడు మరోవైపు ఉండగా ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరుకొన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ షో వరకే పరిమితం అవుతాయనుకొంటే అవి బ‌య‌ట కూడా కంటిన్యూ చేశార‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత తన క్రేజ్ ని క్యాష్ చేసుకొని తను నటించిన రంగు సినిమాను విడుదల చేశాడు.

 

అయితే ఎప్పుడు వ‌చ్చింది.. ఎప్పుడు వెళ్లిందో కూడా చాలా మందికి తెలియ‌దు. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. బిగ్‌బాస్ త‌ర్వాత మళ్ళీ చాన్నాళ్లకు తన లుక్స్ బయటపెట్టాడు. చిన్నప్పుడు సినిమాల్లో మరియు హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన స్టార్టింగ్ లో ఎంత స్మార్ట్ గా ఉన్నడో బిగ్ బాస్ 2 లో అంత దారుణంగా లావయ్యిపోయాడు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పాత రోజుల్లో తనీష్ లా స్మార్ట్ గా తయారయ్యి ఈ లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉండి తన ఫాలోవర్స్ ను కూడా ఈ లాక్ డౌన్ ను పాటించమని కోరుతూ లేటెస్ట్ ఫోటోను షేర్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే త‌నీష్ బిగ్‌బాస్ షోలో కంటే ప్ర‌స్తుతం ఎంతో స్మార్ట్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

 


  

మరింత సమాచారం తెలుసుకోండి: