టాలీవుడ్ లో స్టార్ హీరో కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళల్లో అక్కినేని అఖిల్ ఒకడు. అఖిల్ సినిమాల్లో ఇప్పటి వరకు ఒకటి కూడా చెప్పుకోదగిన విజయం అనేది సాధించలేదు. అఖిల్ సినిమాల విషయంలో నాగార్జున జాగ్రత్తలు తీసుకున్నా సరే అఖిల్ మాట వినడం లేదని తనకు నచ్చిన విధంగా సినిమాలు చేస్తున్నాడని నాగార్జున ఎక్కువగా అసహనం గా ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్య ఎక్కువగా సినిమాలు చేస్తూ కెరీర్ లో మంచి విజయాలు నమోదు చేస్తున్నా అఖిల్ మాత్రం మంచి సినిమా చేయడం లేదు.

 

దీనితో ఇప్పుడు నాగార్జునఅసహనం గా ఉన్నారని అంటున్నారు. దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియకపోయినా అఖిల్ చేసే సినిమా విషయంలో తాను కచ్చితంగా జోక్యం చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట. టాలీవుడ్ లో అందరు యువ హీరోలు జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నా సరే అఖిల్ మాత్రం దూకుడుగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా అతను మంచి సినిమా చేయలేదు. దీనితో దర్శకుడి ఎంపిక నుంచి నిర్మాత ఎంపిక వరకు అన్ని కూడా నాగార్జున జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

ఇక నుంచి అఖిల్ కి స్వేచ్చ వద్దు అనే భావనలో ఉన్నాడు నాగార్జున. అందుకే కథ ఎంపిక తనకు తెలియకుండా చేసుకోవద్దు అని నాగార్జున అఖిల్ కి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ కథ విషయంలో కూడా అఖిల్ కి ఎన్నో సూచనలు చేసిన తర్వాతే ఓకే చేసాడని అంటున్నారు. వచ్చే ఏడాది అఖిల్ రెండు సినిమాలను ఓకే చేసాడు. ఆ కథలను పూర్తిగా విన్న తర్వాతే ఓకే చేస్తా వాటిని పెండింగ్ లో పెట్టాలి అని నాగార్జున సలహా ఇచ్చినట్టు సమాచారం. దీనితో అఖిల్ వెనక్కు తగ్గి ఆ సినిమాలను పక్కన పెట్టాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: