ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న అన్ని దేశాలు కూడా తమ తమ ప్రజలను పూర్తిగా ఇళ్లకు అంకితం చేస్తూ లాకౌట్ లు ప్రకటించగా, మన దేశాన్ని కూడా ఇటీవల ప్రధాని మోడీ ఏకంగా 21 రోజులు లాకౌట్ ప్రకటించారు.  ప్రజల మధ్య సోషల్ డిస్టెన్సింగ్ వల్లనే ఈ మహమ్మారిని వేగంగా తరిమి కొట్టవచ్చని భావించి దేశాలు అన్ని కూడా దీనిని పాటిస్తున్నాయి. అయితే దీని మూలంగా ప్రజలు పూర్తిగా ఇళ్లకు పరిమితం కావడంతో ముఖ్యంగా పేద, దిగువ వర్గాల వారికి పూట గడవని పరిస్థితులు తలెత్తాయి. 

 

దానితో ప్రభుత్వాలు ముందుకు వచ్చి అటువంటి వారిని ఆదుకునేందుకు తమవంతుగా కొంత ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తున్నప్పటికీ, మేము కూడా ఇటువంటి కష్ట సమయంలో ప్రజలను ఆదుకుంటాం అంటూ పలు రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు, అలానే సంస్థలు ముందుకు రావడం, ఎవరికి వారు తమకు వీలైన స్థాయిలో విరాళాలు అందిస్తుండడం జరిగింది. ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది ప్రముఖులు మంచి మనసుతో ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. మమ్ములను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రజలకు మావంతుగా సాయం అందించడం మా కర్తవ్యం అని వారు అంటున్నారు. అయితే వారిలో కొందరు డబ్బు రూపేణ విరాళాలు అందిస్తుంటే, మరికొందరు మాత్రం రోజువారీ కార్మికులకు నిత్యావసర సరుకులు, రెండు లేదా మూడు పూటలా భోజనం వంటివి అందిస్తూ తమ మంచితనాన్ని చాటుకుంటున్నారు. 

 

ఇకపోతే నేడు ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఆ సినిమా నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ తరపున నిర్మాత దానయ్య కలిసి, మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన కరోనా విపత్తు నిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేసారు. నిత్యం మావంటి ఎందరికోసమో కష్టించి పనిచేస్తున్న సినిమా కార్మికులను ఆదుకోవడం మా ధర్మం, వారికోసం మాకు వీలైన ఈ మొత్తాన్ని విరాళంగా అందిస్తున్నట్లు వారు ప్రకటించడం జరిగింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: