పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో హల్ చల్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్.. ఇప్పుడు వరుస సినిమాలతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. 'అజ్ఞాతవాసి' ఘోర పరాజయం తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని ఒకేసారి మూడు సినిమాలను ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమా రీమేక్‌ 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీగా ఒక చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి 'విరూపాక్ష' టైటిల్ అనుకుంతున్నారు. ఈ చిత్రాన్ని బడా ప్రొడ్యూసర్ ఏయమ్ రత్నం నిర్మిస్తున్నారు.

 

దీంతో పాటు పవన్‌ కల్యాణ్‌- హరీష్‌ శంకర్ కాంబినేషన్లో రెండో చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఇదివరకు పవన్-హరీష్‌ కాంబోలో తెరకెక్కిన గబ్బర్‌సింగ్ సూపర్‌ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు రాబోతున్న చిత్రంపై ఫ్యాన్స్ అంతకుమించిన ఆశలను పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హరీష్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీలో గబ్బర్‌ సింగ్ ఛాయలు ఎక్కువగా కనిపించనున్నాయట.

 

అంతేకాదు ఈ సినిమాలో పొలిటికల్ ఫ్లేవర్‌ కూడా ఉండనుందట. నిజ జీవితంలో పవన్‌ పొలిటికల్ క్రేజ్‌కు మరింత పెంచేలా హరీష్‌ డైలాగ్‌లు రాసినట్లు తెలుస్తోంది. మొత్తానికి పవన్ ఫ్యాన్స్‌కు ఈ సినిమాతో మంచి ట్రీట్‌ ఇవ్వబోతున్నారట హరీష్‌. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంభందించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రతో పాటు మరో ప్రాధాన్యత గల పాత్ర ఉండబోతోందంట. ఈ క్యారెక్టర్ లో టాలీవుడ్ లోని ఒక టాప్ యాక్టర్ నటించబోతున్నాడని సమాచారం. ఈ విషయానికి సంభందించిన అధికారిక ప్రకటన రానప్పటికీ ఫ్యాన్స్ మాత్రం అది ఎవరా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: