నా పేరు సూర్య  తరువాత దాదాపు రెండేళ్ల అనంతరం  అల... వైకుంఠపురములో.. అనే సినిమాతో వచ్చి ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.  స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై 150కోట్ల వసూళ్లను రాబట్టి  బాహుబలి సిరీస్ తరువాత టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని టీవి దక్కించుకోగా డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. ఇప్పటికే సన్ నెక్స్ట్ ఈ చిత్రాన్ని స్ట్రీమ్ లో ఉంచగా  మే 1న సాయంత్రం 6:30 కు టీవి  ప్రీమియర్ కూడా  పడనుంది.  మరి ఈ చిత్రం ఎంత టీఆర్పీ ని రాబడుతుందో చూడాలి. కాగా ఇటీవల అల.. మలయాళ వెర్షన్ ను  సూర్య టీవి మొదటి సారి ప్రదర్శించగా 11.17 టీఆర్పీ ని రాబట్టింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా టబు, జయరాం , మురళి శర్మ , సుశాంత్ కీలకపాత్రల్లో నటించారు.  థమన్ సంగీతం అందించాడు. . 
 
సినిమా తరువాత అల్లు అర్జున్ ,సుకుమార్ డైరెక్షన్ లో  తన 20 వచిత్రం లో నటించడానికి రెడీ అవుతున్నాడు. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్ ఖరారు చేయగా రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈచిత్రం జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: