ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కరోనా వ్యాధి విలయతాండవం చేస్తుండడంతో అన్ని దేశాలు కూడా ఇప్పటికే తమ తమ ప్రజలను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేస్తూ లాకౌట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో ఎక్కడి ప్రజలు అక్కడే ఇళ్లలో ఉండిపోవడంతో పాటు అన్ని సంస్థలు, కార్యాలయాలు, కంపెనీలు, వ్యాపార సమూహాలు కూడా మూత పడ్డాయి. దాని వలన కొందరు ప్రజలకు జీవనోపాధి కష్టం అవుతోంది. ఇక ఇంకొందరు దిగువ వర్గాల వారికి అయితే కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థి నెలకొంది.

IHG

ఆదాయం లేక, పనులు లేక ఇళ్లకే పరిమితం అయి ఎన్నో ఇబ్బందులు పడుతున్న అటువంటి వారికోసం మన కేంద్రంతో పాటు ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ఆర్ధిక మొత్తాన్ని సాయంగా ప్రకటిస్తున్నప్పటికీ, మేము సైతం అంటూ పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ దయార్ద్ర హృదయంతో ప్రజలను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆ విధంగా ఎందరో విరాళాలు ఇవ్వగా, మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి కూడా పలువురు ప్రముఖులు తమకు వీలైనంత మొత్తాన్ని, మరికొందరు అయితే రోజువారీ సరుకులు, కూరగాయలు వంటివి అందిస్తూ తమ గొప్ప మనసుని చాటుకుంటున్నారు. 

IHG

ఇకపోతే అసలు విషయం ఏమిటంటే, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు జీవన్, ఇటీవల కొద్దిరోజులుగా ఈ కరోనా మహమ్మారి వలన పనుల్లేక ఇళ్లలో ఉండిపోయి తినడానికి తిండి లేక అల్లల్లాడుతున్న పేద వారిని ఆదుకునేందుకు తన ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు. కొద్దిరోజులుగా ప్రతిరోజూ150 మందికి నిత్యావసరాలు అందిస్తున్న జీవన్, నేడు ఏకంగా 2000 మందికి వాటిని అందించడం జరిగింది. దేవుడు తనకు ఇచ్చిన దానిలో పదిమందికి పంచడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు జీవన్. నిజానికి చేసింది రెండు సినిమాలు, పేరుకి చిన్న నటుడు అయినప్పటికి కూడా జీవన్ చేస్తున్న ఈ పనిని బట్టి చూస్తుంటే అతడి మనసు ఎంత పెద్దదో అర్ధం అవుతుందని అంటూ పలువురు ప్రజలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: