ఎప్పుడు షూటింగులతో బిజీ బిజీగా ఉండే సినిమా స్టార్స్ అంతా ఇప్పుడు ఇంటికి పరిమితం కావడం విశేషం. ఫ్యామిలీతో సరదాగా గడిపే ఈ అవకాశాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కరోనాని పారద్రోలాలి అంటే ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలను స్టార్స్ అంతా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అంతేకాదు ఒకపక్క నిత్యావసరాలు కూడా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు అండగా ఫండ్ రైజింగ్ కూడా చేస్తున్నారు.

 

ఇలాంటి టైం లో ఇంట్లో పిల్లలతో ఆడుకుంటున్నారు కొందరు స్టార్స్. ఇక మళయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మాత్రం తన రెండేళ్ల కూతురికి అడ్డంగా దొరికిపోయాడు. తన కూతురు చేసే అల్లరిని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టాడు దుల్కర్ సల్మాన్. తన కూతురు తనకు నెయిల్ పెయింట్ వేసిందని గర్వంగా చూపించాడు దుల్కర్ సల్మాన్. దుల్కర్ కూతురు ముర్యం అమీరా సల్మాన్ తో ఈ లాక్ డౌన్ టైం ను గడుపుతున్నాడు దుల్కర్ సల్మాన్. కూతురు చేసే అల్లరిని భరిస్తూ తండ్రిగా పొందే ఆనందం చెప్పలేనిది అంటున్నాడు దుల్కర్. 

 

మళయాళ స్టార్ హీరోగా దుల్కర్ సల్మాన్ ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉంటారు. తన కూతురుతో ఇంట టైం స్పెండ్ చేయడం తనకు ఎంతో రీఫ్రెష్ మెంట్ గా ఉందని అంటున్నాడు ఈ స్టార్ హీరో. దుల్కర్ మాత్రమే కాదు ఇంట్లో పిల్లలున్న స్టార్స్ అంటా ప్రస్తుతం వారి చేసే అల్లరిని ఎంజాయ్ చేస్తున్నారు. నెయిల్ పెయింట్ వేసిన  తన చేతి వెళ్ళాను చూపిస్తూ దుల్కర్ సల్మాన్ క్వారెంటైన్ డాడ్ థింగ్స్ అని కామెంట్ పెట్టాడు. మహానటితో తెలుగు ప్రేక్షకులను అలరించిన దుల్కర్ రీసెంట్ గా కనులు కనులను దోచాయంటే సినిమాతో వచ్చాడు. సినిమా బాగున్నా సరే తెలుగులో సరైన ప్రమోషన్స్ లేక ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: