సమ్మర్ లీజర్ టైమ్ కాబట్టి.. కలెక్షన్లు కూడా ఎక్కువగా ఉంటాయన్న నమ్మకంతో సినిమాల్ని సమ్మర్ లోనే స్పెషల్లీ ఎగ్జామ్స్ టైమ్ అయిపోయాక ఏప్రిల్ లో రిలీజ్ చేస్తుంటారు మేకరస్ . అలా గత 3 సంవత్సరాల నుంచి కోట్లకు కోట్లు కలక్షన్లు కురిపించాయి బాహుబలి , అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటి సినిమాలు. మరి ఈ సంవత్సరం కలెక్షన్లు ఎన్ని కోట్లు..?

 

2017  ఏప్రిల్ లో రిలీజ్ అయిన బాహుబలి 2 సినిమా అంచనాలకు మించి సూపర్ హిట్ అయ్యింది. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు బద్దలు కొట్టి 511 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 


వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న అవెంజర్స్  ఇన్‌ఫినిటీ వార్.. సినిమా 2018 ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది. మాంచి సీజన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా 2వేల ధియేటర్ల నుంచి  4 వేల థియేటర్ల లో సూపర్ హిట్ అయ్యి 227 కోట్లు కలెక్ట్ చేసింది.

 

2019 లో అవెంజర్స్ సిరీస్ లో ఫైనల్ మూవీ గా వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ అయితే ఏప్రిల్ లో రిలీజ్ అయ్యి రికార్డులు తిరగరాసింది. మోస్ట్ అవెయిటెడ్, యాంటిసిపేటెడ్ మూవీ గా తెరకెక్కిన ఈ అవెంజర్స్ ఎండ్ గేమ్ 375 కోట్లు సాధించి హయ్యస్ట్ గ్రాసింగ్ మూవీ ఆఫ్ ద ఇయర్ గా నిలిచింది.

 

అంతేకాదు బాహుబలి 511 కోట్లు, దంగల్ 387 కోట్లు ..తర్వాత 375 కోట్లతో  హ్యయస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది ఎండ్ గేమ్ సినిమా. మూడు సంవత్సరాలనుంచి రికార్డులు తిరగరాసే కలెక్షన్లతో ఏప్రిల్ లో రిలీజ్ అయిన సినిమాలు సందడి చేస్తే.. ఈ సంవత్సరం 2020 లో మాత్రం సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించకపోవడం తో  కలెక్షనలు నిల్ గానే కనిపిస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: