కరోనా ఏమో గాని దీని కారణంగా సిని పరిశ్రమ చాలా మంది నోట్లో మట్టి కొట్టడానికి రెడీ అయింది. ఈ ఏడాది ఏ సినిమా విడుదల అయ్యే అవకాశం లేకపోవడం తో హీరోలు ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. అగ్ర దర్శకుల తోనే సినిమాలు చెయ్యాలి అని భావిస్తున్నారు. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా ఇప్పుడు అగ్ర నిర్మాతలు అగ్ర దర్శకులు అంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కథలు రెడీ చేసుకుని దాదాపుగా హీరో ఓకే అనుకున్న తరుణంలో వచ్చిన ఈ కరోనా మహమ్మారి చాలా మంది నోట్లో మట్టి కొట్టింది అనేది వాస్తవం. 

 

చిన్న దర్శకులను అసలు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. చిన్న దర్శకులతో సినిమాలు చేయడానికి ఎవరూ కూడా ముందుకి వచ్చే పరిస్థితి లేదు అనేది వాస్తవం. చిన్న హీరోలు కూడా ఇప్పుడు స్టార్ దర్శకులు అనే పాట ఎక్కువగా పాడుతున్నారు. దీనితో మంచి కథ ఉన్నా సరే చిన్న దర్శకులు కొత్త దర్శకులు ఎక్కువగా సైలెంట్ అవుతున్నారు. కొత్త వాళ్ళతో ఇప్పుడు ప్రయోగాలు వద్దని ఇప్పుడు భారీగా నష్టపోయామని భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా సినిమాలు చేసి దాని నుంచి బయటకు రావడం మినహా మార్గం కనపడటం లేదని అంటున్నారు. 

 

మన తెలుగులో ఇప్పుడు స్టార్ హీరోలు కూడా కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాలను చేస్తున్నారు. స్టార్ హీరోలు నిర్మాతలు గా ఉన్న సినిమాలు కూడా విడుదలకు వెళ్ళే పరిస్థితి లేదు. కరోనా తగ్గితే గాని ఇప్పుడు సినిమా అనేది కనపడే పరిస్థితి లేదు. జనాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు వినోద కార్యక్రమాల విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నాయి అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: