ఒళ్లు దగ్గర పెట్టుకుని పెద్ద వాళ్లనే ఫాలో అయిపోతాను అంటూ కెరీర్ లో షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు . ఇప్పటివరకూ చేసిన పనులు చాలు ఇక ఇలాంటి వాటి జోలికి వెళ్లను అంటున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ  కెరీర్ లో పెద్ద డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పటివరకూ చేసిన ఎక్స్ పెరిమెంట్లు చాలు.. ఇక వాటి జోలికి వెళ్లను అంటున్నాడు.

 

నాగాశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం  తో మంచి సక్సెస్ కొట్టాడు, ఆ తర్వాత ఫ్రెషర్ ..తరుణ్ భాస్కర్  డైరెక్షన్లో  వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్ పేరు సంపాదించాడు విజయ్. తర్వాత వచ్చిన ద్వారక, సినిమా ఫ్లాప్ అయ్యింది.

 

కొత్త డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన అర్జున్ రెడ్డి సెన్సేషన్ అయ్యింది. తర్వాత వచ్చిన మహానటి సినిమాలో కూడా కనిపించాడు . పెద్దగా సక్సెస్ లు లేని పరశురామ్ తో గీతగోవిందం సినిమా చేసి 100 కోట్లతో పెద్ద హిట్ కొట్టాడు తర్వాత వచ్చిన నోటాతో తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు విజయ్.

 

కొత్తగా డైరెక్షన్ చేసిన రాహుల్ సాంస్క్యిత్యన్ తో టాక్సీవాలా చేసి పర్వాలేదనిపించుకున్నాడు . మరోఫ్రెషర్ భరత్ కమ్మ తో డియర్ కామ్రేడ్ చేసి దెబ్బ తిన్నాడు . అంతేకాదు.. ఆ తర్వాత అంతగా సక్సెస్ లు లేని క్రాంతిమాధవ్ తో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేసి మరో సారి ఫ్లాప్ అయ్యాడు.

 

ఈ మద్య  అసలు హిట్లులేకపోవడంతో ఆల్రెడీ కమిట్ అయిన డైరెక్టర్లని కూడా పక్కనపెట్టి పూరీ జగన్నాధ్ తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. కెరీర్ లో ఇప్పటివరకూ కొత్త డైరెక్టర్లతో, కొత్త స్టోరీలతో  చేసిన ప్రయోగాలు చాలు.. వాటి వల్ల తగలిన దెబ్బలు చాలు .. అందుకే నా నెక్ట్స్  సినిమాలు కూడా వెల్ నోన్ డైరెక్టర్లతో, సేఫ్ సబ్జెక్ట్ లే చేస్తానని డిసైడ్ అయ్యాడట విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: