పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించినప్పటి నుండి రోజుకో వార్త వస్తూనే ఉంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు ఏకంగా మూడు సినిమాలు ప్రకటించేశాడు. మొదటి సినిమాగా బాలీవుడ్ పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయింది. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రం లాక్డౌన్ పూర్తయిన కొన్ని రోజులకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

 

అయితే అటు వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటూనే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలోనూ పాల్గొన్నాడు. ఈ సినిమాలో పవన్ ఒక బందిపోటుగా కనిపిస్తాడట. మొఘలుల కాలం నాటి కథతో వస్తున్న ఈ చిత్రం పవన్ కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం. ఇక పవన్ ప్రకటించిన మూడో చిత్రాన్ని గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తారు. ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ ద్వారా మరిచిపోలేని హిట్ ఇచ్చిన ఈ దర్శకుడితో మళ్ళీ సినిమా చేస్తానని ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం పెరిగింది.

 

ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అభిమానులు పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అలా చూపించేందుకు హరీష్ రెడీ అవుతున్నాడు. గబ్బర్ సింగ్ లాగే సినిమా ఫుల్ల్ మాస్ లెంగ్త్ లో ఉంటుందట. మాస్ సినిమాలు తీయడంలో తనదైన ముద్ర చూపించే హరీష్ మరోసారి గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీస్తాడని అనుకుంటున్నారు.

 

అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పక్కన మరో స్టార్ హీరో నటించబోతున్నాడట. ఒకానొక కీలకమైన పాత్రలో మరో స్టార్ హీరోని తీసుకోవాలని చూస్తున్నారట. మరి ఆ పాత్ర చేసేందుకు హరీష్ ఎవరిని సంప్రదిస్తాడో..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: