టాలీవుడ్ లో హీరోలకు ఉండే ఇమేజ్ అంతా ఇంతా కాదు. వాళ్ళతో సినిమాలు చేస్తే హిట్ కాకపోయినా పెట్టుబడులు వస్తాయి అనే భావిస్తూ చాలా మంది నిర్మాతలు వారితో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అందరూ ఇదే ప్రయత్నాల్లో ఉంటారు. దర్శకుల దగ్గర మంచి కథ ఉంటే చాలు ఆలోచించే ప్రయత్నం కూడా చేయకుండా సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇది అంతగా ఫలించడం లేదని అంటున్నారు. హీరోలకు విలువ తగ్గింది అంటున్నారు. 

 

కమర్షియల్ కోణం లో ఆలోచన చేసి చేస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. దీనితో నిర్మాతలు ఇప్పుడు ఎక్కువగా నష్టపోతున్నారు అనేది అర్ధమవుతుంది. దీనితో వాళ్ళు ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడాలని చూస్తున్నారు. హీరోలకు అంత పారితోషికం ఇవ్వాల్సిన అవసరం లేదని చిన్న హీరో అయితే ఆలోచించి ఇవ్వాలని, అగ్ర హీరో అయితేనే అది కూడా భారీ బడ్జెట్ సినిమా అయితేనే చెయ్యాలి అనే అభిప్రాయానికి వచ్చేశారు నిర్మాతలు. దర్శకులు మంచి కథలు తీసుకొచ్చినా ఆలోచించి ముందుకి వెళ్తున్నారు. 

 

టాలీవుడ్ హీరోల విషయంలో మంచి అభిప్రాయం ఉండేది. కమర్షియల్ సినిమాలు అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ మీద సీరియస్ గా ఉండే వాళ్ళ సంఖ్య అనేది ఎక్కువగా ఉంది అనేది వాస్తవం. టాలీవుడ్ లో హీరోల ఆధారంగానే సినిమాలు వస్తూ ఉండేవి. కాని ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళే లాభాల్లో ఎక్కువగా తీసుకోవడం తో మాకు ఏమీ ఉండటం లేదు అనే అభిప్రాయానికి దర్శక నిర్మాతలు వచ్చేశారు. ఎంత సేపు వాళ్ళ కోరికలను తీర్చడమే గాని మా పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదని ఎందరో దర్శక నిర్మాతలు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: