స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న సినిమాకు పుష్ప టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్ గా బన్ని బర్త్ డే నాడు రిలీజ్ చేసిన పుష్ప ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్ని ఊర మాస్ లుక్ తో అందరిని సర్ ప్రయిజ్ చేస్తాడని అంటున్నారు. రంగస్థలంతో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన సుకుమార్ బన్నీతో ఈసారి బాహుబలి రికార్డుల మీద కన్నేసినట్టు తెలుస్తుంది. 


అందుకే సినిమాను ఐదు భాషల్లో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో రష్మిక బన్ని భార్య పాత్రలో కనిపిస్తుందట. అంతేకాదు సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా బాగా రాసుకున్నాడట సుకుమార్. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మని దించుతున్నాడట సుకుమార్. సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఊర్వశి రౌతులాని సెలెక్ట్ చేశారట. 


ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ తో అదరగొడుతున్న ఊర్వశి సౌత్ సినిమాల మీద కన్నేసింది. ఇక్కడ ఛాన్స్ వస్తే నటించేందుకు రెడీ అంటూ చెప్పుకొచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు పుష్ప సినిమా కోసం తెలుగులో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. అయితే ఊర్వశిని కేవలం సాంగ్ కోసమే అన్నట్టు కాకుండా ఆమెకు ఒక పాత్ర ఇస్తున్నారని తెలుస్తుంది. 


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సాహో సినిమాలో జాక్వెలిన్ తో ఒక స్పెషల్ సాంగ్ పెట్టారు. ఆ ఒక్క సాంగ్ కోసం జాక్వెలిన్ 2 కోట్ల దాకా తీసుకుందని అన్నారు. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కోసం ఊర్వశితో చర్చలు జరుపుతున్నారు. తన హాట్ ఫోటో షూట్ తో రచ్చ చేస్తున్న ఈ అమ్మడు సౌత్ లో క్లిక్ అయితే వరుస అవకాశాలు అందుకోవడం కన్ఫర్మ్. మరి అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఊర్వశి ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: