మురుగదాస్ చెన్నైలో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలను పడ్డారట. ఇటీవల ఆ విషయాన్ని గురించి ప్రస్తావించారు. ‘‘గజిని సినిమాను హిందీలో చేసినప్పుడు అంబానీ ఇంట్లో విందుకు వెళ్ళాను. ముఖేష్ అంబానీ భార్య నాకు వడ్డిస్తుంటే నన్ను నేను గిల్లి చూసుకున్నాను. ఒక్కసారి నాకు చెన్నై మేన్షన్ లో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి. అప్పుడు రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులుండేవి కావు. ఇంట్లో అడిగితే ఇస్తారు గానీ అడగాలంటే నామోషీగా ఉండేది. నా పక్క రూమ్ లో ఉన్న స్నేహితుడు ఒకతను ప్రతిరోజూ వంద, 200 చొక్కాలను ఉతికి ఆరేస్తుండేవాడు. విషయం ఏమిటని కనుక్కున్నాను. లాండ్రీ నుంచి బట్టలు తెచ్చి ఉతికిస్తే చొక్కాకు ఓ రూపాయి వంతున ఇస్తున్నారని చెప్పారు. అప్పటి నుంచి అతని సాయంతో నేను కూడా బట్టలుతకడం మొదలుపెట్టాను. ఓ రోజు మా ఓనర్ కంట పడ్డాం. ఆయనకు అప్పటికే నా సినిమా ప్రయత్నాలు తెలుసు.  ‘తమ్ముడూ. నువ్వు సినిమాల్లో స్థిరపడేవరకు రెంట్ ఇవ్వకపోయినా ఫర్వాలేదు గానీ ఇలాంటి పనులు మాత్రం చేయకండి’ అని చెప్పి వెళ్ళాడు. అలాంటి మనుషులు ఈ కాలంలో ఉంటారని కూడా నేననుకోను’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు మురుగదాస్.   

మరింత సమాచారం తెలుసుకోండి: