ప్రస్తుతం చిరంజీవి తన విలాసవంతమైన ఇంటిలో తన స్వీయ గృహ నిర్భందంలో ఉంటూ ప్రకృతిలో వస్తున్న మార్పులను ఆశ్వాదిస్తూ రకరకాల వీడియోలను తన అభిమానులకు షేర్ చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ఈ కరోనా సమయంలో రాజమౌళి నుండి వచ్చిన సమాచారం చిరంజీవికి షాకింగ్ గా మారింది అని అంటున్నారు. 

 

ఇప్పటి వరకు కొరటాల శివ చిరంజీవిల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఆచార్య’ మూవీలో చరణ్ నటించే విషయంలో తన అనుమతులు ఇవ్వడానికి ఆలోచనలు చేసిన రాజమౌళి ఇప్పుడు ఈ విషయమై ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత వెంటనే ‘ఆర్ ఆర్ ఆర్’  పూణే  షెడ్యూల్ ప్రారంభిస్తామని ఆ షెడ్యూల్ లో అలియా భట్ చరణ్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో పాటు ఇంకా చరణ్ కు సంబంధించి చాల కీలక సన్నివేశాలు షూట్ చేయవలసినవి ఉన్నాయని అందువల్ల ఈ ఏడాది చివరి వరకు చరణ్ ను ఆచార్య షూటింగ్ వైపు పంపే ప్రసక్తిలేదు అంటూ చాల సున్నితంగా రాజమౌళి తన అభిప్రాయాలను చరణ్ ద్వారా చిరంజీవి దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం. 

 

దీనితో చరణ్ ‘ఆచార్య’ లో నటించే ప్రసక్తి ఈ ఏడాది లోపు ఉండదు అన్న విషయాలు మెగా కాంపౌండ్ కు పూర్తిగా అర్ధం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీలో మహేష్ నటించడం లేదు అని స్పష్టమైన క్లారిటీ ఇచ్చిన పరిస్థితులలో ‘ఆచార్య’ లో చరణ్ కోసం సృష్టించిన పాత్రను ఇప్పుడు ఎవరిచేత నటింప చేయాలి అన్న అంతర్మధనం కొరటాల చిరంజీవిలలో పెరిగిపోతున్నట్లు టాక్. 

 

ఇలాంటి పరిస్థితులలో షూటింగ్ లు తిరిగి మొదలైనా ‘ఆచార్య’ షూటింగ్ ను ఎలా కొనసాగించాలి అన్న విషయమై సమాధానం లేని ప్రశ్నలు. ప్రస్తుతం కొరటాలను వెంటాడుతున్నట్లు టాక్. దీనితో చరణ్ చేయవలసిన పాత్రను మెగా కాంపౌండ్ కు సంబంధించిన యంగ్ హీరోలలో సాయి ధరమ్ తేజ్ వరుణ్ లతో భర్తీ చేయాలనే  ఆలోచన కొరటాలకు వచ్చినా ఈ ఆలోచనను చిరంజీవి ముందు బయటపెట్టడానికి కొరటాల హడిలిపోతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: