జనసేన అధినేత... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఇప్పుడు పోటీ పడుతున్నారు. చాలా మంది అగ్ర దర్శకులు ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి గానూ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీ గా ఉన్న నేపధ్యంలో ఆయనతో సినిమా చెయ్యాలి అనుకున్న వాళ్ళు వెనక్కు తగ్గుతున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన మూడు సినిమాలను లైన్ లో ఉంచిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ అనే సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారు. 

 

ఈ సినిమాను వచ్చే ఏడాది మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా ఆ సినిమా దాదాపుగా వాయిదా పడినట్టే కనపడుతుంది. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ని దృష్టి లో పెట్టుకుని ఇప్పుడు పవన్ తో సినిమా చేయడానికి కొందరు దర్శక నిర్మాతలు ఎక్కువగా పోటీ పడుతున్న్నారు. టాలీవుడ్ లో ఆయనతో గతంలో సినిమాలు చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆయనతో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పవన్ రాబోయే రెండేళ్ళు చాలా బిజీ గా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. 

 

ఇది పక్కన పెడితే ఆయన ఇప్పుడు హరీష్ శంకర్ తో చేసే సినిమా రద్దు చేసి పూరి జగన్నాథ్ తో చేసే సినిమాను ఓకే చేసినట్టు తెలుస్తుంది. ముందు పూరి సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత ఆ సినిమాను మొదలు పెట్టే ఆలోచన పవన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి అప్పుడు హరీష్ శంకర్ సినిమాను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇక నిర్మాతకు కూడా ఇదే విషయం పవన్ చెప్పినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: