రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ పై అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ వాయిస్ తో వచ్చిన ఒక నిమిషంన్నర వీడియోతో గూస్ బంప్స్ తెప్పించాడు రాజమౌళి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్ ఇచ్చిన ఈ గిఫ్ట్ అదిరిపోయింది.

 

అయితే మే నెలలో వచ్చే ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు రామ్ చరణ్ ఇచ్చే భీమ్ కి ఇచ్చే గిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలన్న ఆసక్తి ఇంకా పెరిగింది. అయితే ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగణ్ గురించి మరో అప్డేట్ బయటకి వచ్చింది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిజజీవిత పాత్రలతో తెరకెక్కుతుందని తెలిసిందే.

 

నిజ జీవితంలో కొమరంభీమ్, అల్లూరి సీతారామరాజులు కలుసుకున్నట్లు ఎవ్వరికీ తెలియదు. 1920 ప్రాంతంలో వారిద్దరూ ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్లారనేది ఎవ్వరికీ తెలియదు. ఇద్దరి జీవితంలో ఒకే సమయంలో ఒకేలాంటి సంఘటన జరిగింది. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ తోనే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కథ రాసుకున్నాడట. అయితే ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ ఎలా కలుస్తారనే ఆసక్తి బాగా పెరిగింది.

 

అయితే అజయ్ దేవగణ్ పాత్ర ద్వారానే వీరిద్దరూ కలుస్తారని సమాచారం. ఫ్రీడమ్ ఫైటర్ గా కనిపిస్తున్న అజయ్ దేవగణ్ పాత్ర ద్వారా స్ఫూరి పొంది స్వాత్రంత్ర్య కాంక్ష రగిల్చేలా చేస్తుందని అంటున్నారు. ఇద్దరు వీరులకి స్ఫూర్తి కలిగించేలా అజయ్ దేవగణ్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందట. లాక్డౌన్ పూర్తయ్యక అజయ్ దేవగణ్ లుక్ కూడా రిలీజ్ చేస్తారట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: