కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత సమయంలో ప్రభుత్వానికి సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తల వరకూ ఎందలో తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. విరివిగా విరాళాలు ఇస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. సినిమా పరంగా చూస్తే షూటింగ్స్ లేకపోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరికి అండగా నిలుస్తూ టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు ప్రకటించి కార్మికులను ఆదుకుంటున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చి సీసీసీ ఏర్పాటు చేయడం విశేషం. ఈ విరాళాలతో రోజువారీ ఉపాధి కోల్పోయిన ఎందరో కార్మికులకు ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నారు.

 

 

అయితే.. తెలుగు హీరోలు, నటులు, నిర్మాణ సంస్థలు విరాళాలు ఇస్తుంటే మాత్రం హీరోయిన్లు వైపు నుంచి మాత్రం ఎటువంటి స్పందన రావటం లేదు. దీనిపై చిరంజీవి ఆగ్రహంగా ఉన్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై కొందరు హీరోయిన్లకు ఫోన్ కాల్స్ వెళ్లినట్టు కూడా చెప్తున్నారు. మన ఎదుగుదలకు ఇంతగా కారణమైన ప్రేక్షకులు, కార్మికులు ఆపదలో ఉన్నప్పుడు ఎంతోకొంత విరాళం ఇవ్వాల్సిన బాధ్యత ఉండాలి కదా.. అని చెప్పనట్టు ఇండస్ట్రీలో జోరుగా వార్తు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలపై అఫిషియల్ న్యూస్ లేకపోయినా ఫిలింనగర్ లో ఈ వార్త బాగా రౌండ్ అవుతోంది.

 

 

చిరంజీవి పిలుపుకు స్పందించి ఎంతో మంది ముందుకొస్తే హీరోయిన్లు మాత్రం స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. హీరోయన్ల వ్యవహారంపై ఇప్పటికే బ్రహ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతున్న ఏ హీరోయిన్ కూడా ఇప్పటికీ స్పందించలేదు. తమిళ పరిశ్రమకు నయనతార ఏకంగా 20లక్షలు విరాళంగా ఇచ్చిన సంగతి తెలసిందే. హీరోయిన్ల తీరుపై ప్రేక్షకుల్లో కూడా అసహనం వ్యక్తమవుతోంది. మరి.. టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్లు అని చెప్పుకుంటున్న వారు ఇకనైనా స్పందిస్తారో లేదో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: