ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా ముందుగా ముందుకొచ్చేది సినీ పరిశ్రమమే. ప్రస్తుత కరోనా కల్లోల సమయంలో కూడా తన వంతు సాయం చేస్తోంది. ఇందులో మన టాలీవుడ్ ముందు ఉంటుంది. కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. టాలీవుడ్ టాప్ డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ కూడా తమిళ సినీ పరిశ్రమకు తన వంతు సాయం చేశాడు. ఏకంగా 3కోట్ల రూపాయలు తమిళ పరిశ్రమకు, అక్కడి ప్రభుత్వానికి విరాళంగా అందించాడు. కానీ.. తన ఎదుగుదలకు నిలయమైన తెలుగు చిత్ర పరిశ్రమను ఏమాత్రం పట్టించుకోలేదు.

 

 

ఏపీ ప్రభుత్వానికి కాకపోయినా.. తనను ఇంతగా ఆదరించి తెలుగు ప్రజలు, సినీ పరిశ్రమకు రూపాయి కూడా ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. లారెన్స్ తమిళ వ్యక్తే అయినా తాను పూర్తిగా ఎదిగింది మాత్రం తెలుగులోనే. ముఖ్యంగా చిరంజీవి సినిమాలకు డ్యాన్స్ కంపోజ్ చేసి టాప్ డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగిపోయాడు. తను కాంచన సిరీస్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. సినిమాలు కాకుండా ఎంతో చారిటీ చేస్తూ మంచి పేరు తెచ్చకున్నాడు లారెన్స్. ఆమధ్య చిరంజీవిని కలసి తాను హైదరాబాద్ లో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పుకున్నాడు. ఇందుకు చిరంజీవి 10లక్షలు లారెన్స్ చారిటీకి ఇచ్చాడు.

 

 

ఇప్పుడు అదే చిరంజీవి టాలీవుడ్ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీకి మాత్రం కనీసం రూపాయి ఇవ్వలేదు. ట్విట్టర్లో చిరంజీవి ఈ విరాళాల కోసం ప్రకటించినా స్పందించ లేదు. లారెన్స్ తీరుపై తెలుగు ప్రేక్షకుల్లో అసహనంతో పాటు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లారెన్స్ డ్యాన్స్ గ్రూప్ లో తెలుగు డ్యాన్సర్స్ కూడా ఉన్నారు. ఇలాంటి వారిని కూడా లారెన్స్ గుర్తించకపోవడం దారుణమైన విషయమే. లారెన్స్ కు తమిళ పరిశ్రమ కార్మికుల పట్ల ఉన్న శ్రద్ధ తెలుగు పరిశ్రమ కార్మికులపై లేకపోవడం తగనిది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: