దేశంలో కరోనా వైరస్ ని సంపూర్ణంగా తరిమికొట్టేందుకు గత నెల 24 నుంచి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  జనాలు ఎక్కువగా గుమి కూడి ఉండటం.. సామాజిక దూరం పాటించకపోవడం వల్ల వైరస్ వెగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ద్వారా ఈ సమస్యను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు.  ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు సూచనలు ఇస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.  రోడ్లు, చెక్ పోస్ట్, గల్లీలు ఎక్కడ పడితే అక్కడ పోలీసలు పహారా కాస్తున్నారు.  కరోనా వ్యాప్తి ఉందని తెలిసినా ఎంతో ధైర్యంతో తమ విధులు నిర్వహిస్తున్నారు.

 

 తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు చేస్తున్న సేవలకు సినీ సెలబ్రెటీలో ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నారు.  మొన్న మహేష్ బాబు.. నిన్న మెగాస్టార్ చిరంజీవి.. నేడు విక్టరీ వెంకటేష్ తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు చేస్తున్న కృషి.. సేవకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విపత్కర సమయంలో వారు చేస్తోన్న సేవలు మరవలేనివని కొనియాడుతున్నారు. వైద్యులు, పోలీసులపై సినీనటుడు వెంకటేశ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఆసుపత్రుల్లో బాధితుల ప్రాణాలు కాపాడుతున్నసూపర్‌ హీరోలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే, కరోనాపై పోరాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా ప్రాణాలు కాపాడుతున్నందుకు థ్యాంక్స్‌' అని ట్వీట్ చేశారు.

 

ఇప్పుడు దేశంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మీరు చేస్తున్న సేవలు ప్రతి పౌరుడు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని అన్నారు.  మీరు నిజమైన హీరోలు సెల్యూట్‌ అని వెంకటేశ్‌ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ, పోలీసులను ట్యాగ్‌ చేశారు. ప్రజలంతా సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని ఆయన కోరారు. కాగా, భారత్‌లో కరోనా విజృంభణతో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: