క‌రోనా దెబ్బ‌కు యావ‌త్ ప్ర‌పంచం... భార‌త‌దేశ‌మే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా అల్లాడుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ ప్ర‌భావానికి గురి కాని వాళ్లు చాలా త‌క్కువ మంది మాత్ర‌మే ఉన్నారు. ఇక క‌రోనా నేప‌థ్యంలో పారిశ్రామిక వేత్త‌లు, సెల‌బ్రిటీలు త‌మ వంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు మాత్రం త‌మ‌కెందుకులే అని మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి వారిపై నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ లిస్టులో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. ఎస్ ఎస్ రాజమౌళి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

 

త‌ర‌చూ హంగామా చేస్తూ వార్త‌ల్లో ఉండే విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు క‌రోనా బాధితుల‌కు సాయం ఇచ్చే విష‌యంలో నోరు మెద‌ప‌డం లేద‌ని అంటున్నారు. ఇక ఖ‌ర్చీఫ్ క‌ట్టుకోండ‌ని విజ‌య్ పైసా ఖ‌ర్చులేని సందేశం ఇవ్వడంతో విజ‌య్‌పై మ‌రిన్ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక నెంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కూడా  నిర్మాత దానయ్య తో కలిసి 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చానని సోషల్ మీడియాలో ప్రకటించడం తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. 

 

భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకునే రాజ‌మౌళి కేవ‌లం రు. 10 ల‌క్ష‌లు ఇవ్వడం ఏంట‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తుంటే.. మ‌రి కొంద‌రు మాత్రం ఈ రు. 10 ల‌క్ష‌లు కూడా దాన‌య్యే ఇచ్చి ఉంటాడ‌ని అంటున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం కోట్లు సంపాదించే రాజ‌కీయ నాయ‌కులు, పారిశ్రామిక వేత్త‌లు అస్స‌లు ఇన్‌కం ట్యాక్స్ క‌ట్ట‌ర‌ని.. కానీ రాజ‌మౌళి తాను సంపాదించే ప్ర‌తి పైసాకు ట్యాక్స్ క‌డ‌తార‌ని... ఆయ‌న్ను ఇలా టార్గెట్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని అంటున్నారు. ఇక విజ‌య్‌ సంగతి కూడా సరేసరి. పుట్టినరోజుకు హిమక్రీములు పంచడం.. పబ్లిసిటీ దంచుకోవడం కాదు.. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రజలకు తోడుగా ఉండాలంటూ నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: