తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు శేఖర్ కమ్ముల కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండడంతో పాటు యువతని బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. శేఖర్ కమ్ముల సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులందరూ ఓ మంచి అభిప్రాయం ఉంటుంది. మంచి కథ ఉంటే తప్ప శేఖర్ కమ్ముల సినిమా చేయడు  అనే నమ్మకం తెలుగు ప్రేక్షకుల్లో ఉంటుంది. ఓవర్సీస్ లో కూడా శేఖర్ కమ్ముల సినిమాలు మంచి మార్కెట్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. శేఖర్ కమ్ముల ఏ సినిమా చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కమర్షియల్ హంగులు తక్కువగా ఉండేలా సినిమాను తెరకెక్కించి... నిజ జీవితానికి దగ్గరగా ఉండే విధంగా ప్రేక్షకులకు కట్టిపడేసే విధంగా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు శేఖర్ కమ్ముల. 

 

 ఇలా వచ్చిన ఫిదా సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా సినిమాగా  వచ్చిన ఫిదా సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. సినిమాలో  సాయి పల్లవి తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం.. అంతేకాకుండా వరుణ్ తేజ్ తన నటనతో ఆకట్టుకోవడం... శేఖర్ కమ్ముల టేకింగ్ ఇలా అన్ని  ప్రేక్షకులకు తెగ నచ్చటంతో మంచి విజయాన్ని కట్టబెట్టారు. ఫిదా సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల మరోసారి  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్నాడు . నాగచైతన్య సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. అయితే లాక్ డౌన్ లేకుంటే  ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యేది.  

 

 ఈ సినిమాని జూన్ లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నారట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను ఓవర్సీస్లో పంపిణీ చేసేందుకు బయ్యర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ సినిమాకు భారీగానే రేట్ ఆఫర్ చేస్తున్నారట బయ్యర్లు. శేఖర్ కమ్ముల సినిమాలు అంటే శాటిలైట్ లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. దీంతో లవ్ స్టోరీ సినిమా రైట్స్ ని ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా  ఉన్నట్లు సమాచారం. లవ్ స్టోరీ సినిమాతో ఏషియన్  డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్మాణంలో కూడా అడుగుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ పాట లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది . కాగా నాగచైతన్య కెరీర్లోనే పెద్ద సక్సెస్ అవ్వడం ఖాయం అని అంటున్నారు అక్కినేని అభిమానులు .

మరింత సమాచారం తెలుసుకోండి: