అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న పుష్ప సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు. సినిమాలో అల్లు అర్జున్ ఊరస్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథతోనే ఈసినిమా వస్తున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ లో బన్ని పోలీస్ స్టేషన్ లుక్ చూస్తే అర్ధమయ్యింది. అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ మూవీకి పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 

 

సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తుండగా.. ఇక పుష్ప రాజ్ ను ఢీ కొట్టే విలన్ ను బాలీవుడ్ నుండి పట్టుకొస్తున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి పుష్ప విలన్ గా చేస్తాడని తెలుస్తుంది. ఈమధ్య సునీల్ శెట్టి సౌత్ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సూపర్ స్టార్ రజినికాంత్ దర్బార్ లో విలన్ గా నటించాడు సునీల్ శెట్టి.

 

సుకుమార్ చెప్పిన కథకు సునీల్ శెట్టి ఫిదా  అయినట్టు తెలుస్తుంది. రంగస్థలంతో నాన్ బాహుబలి రికార్డుల పని పట్టిన సుక్కు ఈసారి పుష్పతో బాహుబలి రికార్డుల మీద గురి పెట్టినట్టు తెలుస్తుంది.మొదటిసారి బాలీవుడ్ బాక్సాఫీస్ పై పోటీకి దిగుతున్న అల్లు అర్జున్ అదిరిపోయే కాంబినేషన్ తో వస్తున్నాడు. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ చేస్తున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. పుష్ప సినిమా విషయంలో సుకుమార్ చాలా కేర్ తీసుకుంటున్నాడట. సుకుమార్ కూడా ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అనుకున్న విధంగా సినిమా వస్తే మాత్రం సుకుమార్ పేరు నేషనల్ వైడ్ గా మారుమోగుతోంది. బన్నీ కూడా సథరన్ స్టార్ గా మరింత క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: