నిధి అగర్వాల్.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌సరం లేని పేరు. మున్నామైఖెల్ తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయ‌మైన ఈ బ్యూటి.. అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందం, అభినయంతో ఆకట్టుకుంది నిధి. అయితే పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది ఈ భామ‌. 

IHG

ఈ చిత్రాని కంటే ముందు నిధి అగ‌ర్వాల్ చాలా చిత్రాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ, ఈ సినిమాకి వ‌చ్చినంత పేరు మ‌రే చిత్రానికి రాలేదు అన్న‌ది వాస్త‌వం.  ఈ సినిమాలో డాక్టర్‌గా మంచి నటనతో పాటు తన గ్లామర్‌తో కుర్రకారుని కట్టిపడేశారు. ఈ చిత్రం త‌ర్వాత నిధికి వ‌ర‌స అవ‌కాశాలు వ‌చ్చి ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మహేష్ బాబు మేనల్లుడు, గల్ల జయదేవ్ కుమారుడు గల్ల అశోక్ హీరోగా పరిచయం అవుతోన్న సినిమాలో నిధి హీరోయిన్‌గా నటిస్తుంది.  యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు.

IHG

అలాగే రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఫైనల్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇక ప్ర‌స్తుతం కరోనా దెబ్బకు సినిమా షూటింగ్స్ అన్ని బంద్ అయ్యాయి. దీంతో హీరోలు, హీరోయిన్స్ ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అందులో భాగంగా కొందరూవంటలు చేస్తుంటే మరికొందరూ ఇంటి ప‌నులు లాంటీవి చేస్తున్నారు. 

IHG

నిధి అగర్వాల్ మాత్రం సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌కు తెర లేపింది. తాజాగా బాతింగ్ సూట్‌లో హాట్ హాట్‌గా క‌నిపిస్తున్న నిధి పిక్స్‌ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. అవి ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే మ‌తి పోవాల్సిందే అన్న‌ట్టుగా నిధి క‌నిపిస్తోంది. మ‌రి ఆ ఫోటోల‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

IHG

 

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: