మెగా హీరోలు అందరూ కూడా ఇప్పుడు కలిసి పని చేయడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఇద్దరు హీరోలు కలిసి చేస్తే మార్కెట్ పెంచుకునే అవకాశం ఉంటుంది అని భావిస్తున్న హీరోలు ఇప్పుడు అందరూ కూడా కలిసి పని చేయడానికి ఎక్కువగా రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇది మార్కెట్ సీక్రెట్ కావడం తో నిర్మాతలు కూడా దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చిరంజీవి సినిమాలో మహేష్ బాబు లేదా రామ్ చరణ్ నటించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. 

 

సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వచ్చే సినిమా ఎం చేస్తాడు అనేది అందరిలోను ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్ చాలా జాగ్రత్తగా సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాను చేయబోయే తర్వాతి సినిమాలో బాబాయి కి ఒక కీలక పాత్ర ఇచ్చే ఆలోచన చేస్తున్నాడు రామ్ చరణ్. త్వరలోనే సినిమాను ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమా లో పవన్ మాఫియా లో ఉంటాడని సమాచారం. 

 

ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు హీరోలు ట్రై చేస్తున్న ఈ ప్లాన్స్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. వచ్చే ఏడాది వచ్చే సినిమాలు అన్నీ కూడా దాదాపుగా ఇలానే ఉండే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా భారీగా మార్కెట్ ని ప్లాన్ చేసుకుని పాన్ ఇండియా వైడ్ గా సినిమాలను విడుదల చెయ్యాలని చూస్తున్నారు. రామ్ చరణ్ తర్వాతి సినిమా కొత్త దర్శకుడి తో చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: