టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతుంది ‘రౌద్రం రణం రుదిర’ (ఆర్ఆర్ఆర్).  ఈ ఉగాది సందర్భంగా ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.  ఆ తర్వాత రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా  అల్లూరి సీతారామరాజు పాత్ర కు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు.  ఇందులో ముఖ్యపాత్రలో నటిస్తున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవగాన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేయాల్సి ఉన్నా.. లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు. ఈ మూవీలో అజయ్ దేవగాన్ కి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

 

అయితే ఆ పాత్ర ఎలా ఉంటుంది? ఆ పాత్ర ప్రయోజనం ఏమిటి? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్వాతంత్య్ర కాంక్షను బలంగా కలిగిన ధీరుడిగానే ఆయన పాత్ర ఉంటుందనేది తాజా సమాచారం.  ఆయన పాత్ర నిడివి తక్కువే ఉన్న అజయ్ దేవగణ్ పాత్ర వల్లే ఎన్టీఆర్ - చరణ్ పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయని.. మొత్తానికి అజయ్ దేవగణ్ పాత్ర ఇన్స్పిరేషన్ గా ఉండనుందని సమాచారం.  ఈ మూవీలో మన్యం వీరుడుగా అల్లూరి సీతారామరాజు.. తెలంగాణ మన్యం వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా కొమురం భీమ్ వీడియో రిలీజ్ చేస్తారని ఆ మద్య వార్తలు వచ్చాయి. 

 

 

స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాకముందు ఇలాంటి కథలు ఎన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.  గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 మూవీకి సంబంది కూడా ఇలాంటి కథనాలు ఎన్నో వచ్చిన విషయం తెలిసిందే.   ఏది ఏమైనా ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే దాకా ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: