కరోనాను అరికట్టేందుకు ఇండియాలోని సూపర్ స్టార్స్ అందరూ ఒకే వేదికపైకి వచ్చారు. అలాగని ఈ లాక్ డౌన్ టైమ్ లో అందరూ ఒకే చోటికొచ్చి నటించలేదు. కరోనాను కట్టడి చేసేందుకు తమలాగే అంతా ఇళ్లకే పరిమితం కావాలన్న సందేశం ఇస్తూ.. ఫ్యామిలీ అనే షార్ట్ ఫిలింలో విడివిడిగా ఉంటూనే.. కలిసి నటించిన ఫీలింగ్ క్రియేట్ చేశారు. 

 

అమితాబ్ బచ్చన్ సలహా.. సూచన మేరకు సోనీ నెట్ వర్క్ ఈ షార్ట్ ఫిలిం రూపొందించింది. అమితాబ్ ఇంట్లో ఉంటూ.. తన కూలింగ్ గ్లాసెస్ వెతుకుతుంటాడు. అవెక్కడున్నాయో.. రణ్ వీర్.. దిల్జీత్ దోసంజ్ ఇళ్లంతా కలియతిరుగుతారు. ఈ క్రమంలో చిరంజీవి.. రజినీకాంత్.. మోహన్ లాల్.. మమ్ముట్టి.. శివరాజ్ కుమార్ ను కూలింగ్ గ్లాసెస్ గురించి ఆరా తీస్తారు. చివరికి కూలింగ్ స్పెట్స్ ను ప్రియాంకా చోప్రా తీసుకెళ్లి అమితాబ్ కు ఇవ్వడంతో కథ సుఖాంతం అవుతుంది. 

 

షార్ట్ ఫిలిమ్ చివర్లో ఇది ఎందుకు తీయాల్సి వచ్చిందో చెప్పారు అమితాబ్. లాక్ డౌన్ సందర్భంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులు.. దినసరి కూలీలకు నిధులు సమకూర్చడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు అమితాబ్. 

 

ఈ షార్ట్ ఫిలిమ్ లో నటించన వారందరూ ఇళ్లకే పరిమితమయ్యారని చెప్పారు అమితాబ్. ఎవరూ భయపడొద్దని ఇళ్లకే పరిమితమైతే.. మహమ్మారి తొలిగిపోతుందన్నారు. షార్ట్ ఫిలిమ్ లో రజినీకాంత్ తనదైన స్టైల్లో స్పెట్స్ తిప్పిన తీరు.. బాత్రూమ్ లోకి నీళ్లే రావడం లేదు. ఇక కళ్లజోడు ఏమొస్తుందని చిరంజీవి వెటకారం.. రణ్ వీర్, దిల్జీత్.. ఆలియా భట్ చేసిన సందడి బాగుంది. ఇంతమంది సూపర్ స్టార్స్ నటించిన ఈ షార్ట్ ఫిలిమ్ ను ప్రముఖ యాడ్ డైరెక్టర్ ప్రసూన్ పాండే డైరెక్ట్ చేశారు. మొత్తానికి అమితాబ్ ఇటు సినీనటులకు అటు ప్రజలకు మంచి సందేశాన్నే ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: