కరోనా వల్ల పనులు లేక నానా అవస్థలు పడుతున్న సినీ కార్మికుల కు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కి విశేషమైన స్పందన వస్తుంది. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో వున్న చాలా మంది ప్రముఖులు  సీసీసీకి విరాళాలు ఇవ్వగా తాజాగా ఈ జాబితాలోకి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా చేరాడు. మన ఫిలిం ఇండస్ట్రీ లో రోజువారి వేతన కూలీల కోసం 5 లక్షలను సీసీసీ కి డొనేట్ చేస్తున్నాను..సాయం కాదిది తోడు అని కొరటాల ట్వీట్ చేశాడు. ఇంతకుముందు కరోనా పై పోరుకు ఈ డైరెక్టర్ తెలంగాణ, ఆంధ్రా ముఖ్యమంత్రుల సహాయనిధికి 5లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు. 
 
 
ఇక భరత్ అనే నేను తరువాత చాలా గ్యాప్ తీసుకున్న కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా రెండు కీలక షెడ్యూల్ లను పూర్తి చేసుకుంది. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. కాజల్ కథానాయికగా నటించనుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా ఈసినిమా ను ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే ఇప్పటివరకు సోషల్ మెసేజ్ తో కథను రెడీ చేసుకొని దానికి కమర్షియల్ అంశాలను జోడించి బ్లాక్ బాస్టర్ హిట్లు కొడుతూ వస్తున్న కొరటాల, ఆచార్య ను కూడా అదే ఫార్ములా తో తెరకెక్కిస్తున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: