ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంద‌రూ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం క‌ళ్లుకాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నాడు. వాస్త‌వంగా ఈ యేడాది జూన్‌లో రావాల్సిన ఈ సినిమా వాయిదా ప‌డి వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8వ తేదీకి వెళ్లిపోయింది. ఇక సంక్రాంతికి ఈ సినిమాను తీసుకు వ‌స్తే బాహుబ‌లి రేంజ్‌కు త‌గ్గ‌కుండా ఉంటుంద‌ని... అవ‌స‌ర‌మైతే ఆ సినిమా రికార్డుల‌ను సైతం క్రాస్ చేయించ‌వ‌చ్చ‌ని రాజ‌మౌళి అదిరిపోయే స్కెచ్ వేశాడు. అందుకే ముందుగా జూన్‌లో రిలీజ్ డేట్ ప్ర‌క‌టించి కూడా మ‌ళ్లీ సంక్రాంతికి వాయిదా వేశారు.

 

అయితే ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సినిమాల రిలీజ్‌లు, షూటింగ్‌లు అన్ని బంద్ అయ్యాయి. అస‌లు ఇప్ప‌ట్లో థియేట‌ర్లే తెరిచే ప‌రిస్థితి లేదు. దీంతో ఆర్ ఆర్ ఆర్‌ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏ జూన్ లేదా జూలైలో తిరిగి షూటింగ్‌లు స్టార్ట్ అయితే ఇప్పుడున్న సినిమాల రిలీజ్ డేట్లు అన్నీ ఖ‌చ్చితంగా వాయిదా ప‌డ‌నున్నాయి. ఈ లెక్క‌న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కూడా మ‌రో మూడు నాలుగు నెల‌లు ఆల‌స్యంగా జ‌రిగి వ‌చ్చే స‌మ్మ‌ర్‌కు కాస్త ముందో లేదా కాస్త వెన‌కో రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

 

అయితే మోగాస్టార్ చిరంజీవి - రామ్‌చ‌ర‌ణ్ కాంబోలో కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఆచార్య సినిమా ఇప్పుడు సంక్రాంతికి రెడీ అవుతోంది. రామ్‌చ‌ర‌ణ్‌కు ఆచార్య సినిమాను డిలే చేసే ఉద్దేశ్యం లేదంట. రాజ‌మౌళిని క‌న్వీన్స్ చేసి అయినా షూటింగ్ త్వ‌ర‌గా కంప్లీట్ చేసి వ‌చ్చే సంక్రాంతి బ‌రిలో దింపాల‌ని చూస్తున్నాడ‌ట‌. ఏదేమైనా రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్‌ను సంక్రాంతికి దింపేలా స్కెచ్ వేసుకుంటే ఇప్పుడు ఈ ప్లేస్‌లోకి మెగాస్టార్ త‌న సినిమాతో రంగంలోకి దిగ‌నున్నాడ‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: