ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా అంతా సోష‌ల్ మీడియా హ‌వా న‌డుస్తోంది. సోష‌ల్ మీడియా బాగా విస్త‌రించ‌డంతో ప్ర‌పంచం ఓ కుగ్రామంలా మారిపోయింది. అలాగే సెల‌బ్రిటీల మ‌ధ్య దూరం త‌గ్గింది. ఈ మేర‌కు ప్ర‌తి ఒక్క నెటిజ‌న్లు సెల‌బ్రిటీలతో నేరుగా త‌మ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే సినిమా స్టార్స్ త‌మ చిన్న‌ప్ప‌టి ఫోటోల‌ను కూడా షేర్ చేస్తూ షాక్‌లు ఇవ్వ‌డంతో పాటు త‌మ అభిమానుల‌కు స‌ర్‌ఫ్రైజ్ ఇస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే స‌మంత చిన్న‌ప్ప‌టి ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

మాయ చేశావే సినిమాతో తెలుగె తెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ చెన్నై చిన్న‌ది త‌న తొలి సినిమా హీరో నాగ‌చైత‌న్య‌నే చివ‌ర‌క పెళ్లాడి అంద‌రికి షాక్ ఇచ్చింది. తొలి సినిమాతోనే తెలుగులో కుర్ర‌కారు క‌ల‌ల రాణిగా మారిపోయింది. తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ఆమె ఓ వెలుగు వెలుగుతోంది. పెళ్ల‌య్యాక కూడా ఆమె ఛ‌రీష్మా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఇక సౌత్ ఇండియాలో దాదాపు అంద‌రు స్టార్ హీరోల‌తో ఆమె న‌టించింది. పెళ్ల‌య్యాక కూడా భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన మ‌జిలీ సినిమా గాని.. లేడీ ఓరియంటెడ్ రోల్లో చేసిన ఓ బేబీ కాని సూప‌ర్ హిట్ అయ్యాయి.

 

ఇక తాజాగా మీరు చూస్తోన్న పై ఫోటోలో ఉన్న‌ది స‌మంతేనా ? అన్న డౌట్లు చాలా మందికి వ‌స్తుంటాయి. ఈ ఫొటోలో స‌మంత బొద్దుగా ఉండ‌డంతో పాటు క్యూట్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంది. అలాగే సమంత చబ్బీ చీక్స్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇటీవ‌ల‌ సమంత మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ 2019 అవార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె తెలుగులో మ‌ళ్లీ ఎప్పుడు స్క్రీన్  మీద క‌నిపిస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: