ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా విజయాలు సాధించి స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన హీరో రవి తేజా. అతనికి మంచి ఇమేజ్ వచ్చింది తక్కువ కాలంలో. ఆ తర్వాత అతను చాలా మంది అగ్ర దర్శకులతో సినిమాలు చేసాడు. రాజమౌళి దర్శకత్వంలో అతను చేసిన విక్రమార్కుడు సినిమా సూపర్ హిట్ అయింది కూడా. ఇక అక్కడి నుంచి మాస్ మహారాజాకు డిమాండ్ కూడా బాగానే పెరిగింది. అయితే రవి తేజా ఆ ఇమేజ్ ని తర్వాత కాపాడుకోలేదు. అతని సినిమాల్లో ఒకప్పుడు ఉండే కామెడి ఇప్పుడు లేకుండా పోయింది అనేది వాస్తవం. 

 

హీరో నవ్వడమే గాని అభిమానులు ప్రేక్షకులు నవ్వినా సందర్భం సినిమాలో చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో రాజా ది గ్రేట్ మినహా అతను చేసిన ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ఇటీవల అతను చేసిన డిస్కో రాజా సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ సినిమా కరోనా లేకపోతే ఈ నెలలో విడుదల అయ్యేది. ఈ సినిమా తర్వాత అతను ఎవరి తో సినిమా చేస్తాడు అనేది స్పష్టత లేదు. ప్రస్తుతం అతని కోసం దర్శకులు ఎవరూ కూడా ముందుకి రావడం లేదు. 

 

రవి తేజా తో ఒకప్పుడు సినిమా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు డ్రాప్ అయ్యారు. మరి దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని రవి తేజా మాత్రం హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. అతను ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితే మినహా... అతనీతో ఎవరు కూడా సినిమా చేసే పరిస్థితి ఉండదు. అందుకే రవి తేజా ఎలా అయినా సరే హిట్ కొట్టాలి అని భావిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: