దిమ్మ తిరిగితే బొమ్మ కనిపిస్తుంది. ఎవరికైనా అంతే, స్రుష్టికి ప్రతి స్రుష్టి చేసే వారు ఎంతటి వారైనా కూడా ఇదే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న శక్తి అలాంటిది కాబట్టి. సామాన్య మానవుడైనా, మహామహులైనా కూడా జరిగేది ఇదే.

ఇపుడు సినీ లోకం పెద్దలకు మెల్లగా కళ్ళు తెరుచుకుంటున్నాయి. కరోనా పుణ్యమాని వారంతా నేల చూపులు చూస్తున్నారు. వందల కోట్ల వ్యాపారం బుగ్గి పాలు అవుతుందేమోనని దిగాలు పడుతున్నారు. బొమ్మ తిరగబడితే పంబ రేగుతుంది. ఉన్నదీ, దాచుకున్నదీ మొత్తం పోతుంది.

వందల కోట్లు, పాన్ ఇండియా మూవీస్ కి అలవాటుపడిన ప్రాణాలకు ఇపుడు నేల టికెట్ల సావాసం చేయాలంటే  చాలా కష్టం. అయినా ఇది తప్పదు. అందుకే ఏదోలా ఈ గండం నుంచి గట్టెక్కితే ఆ తరువాత కధ చూసుకోవచ్చు అనుకుంటున్నారుట.

 

కరోనా వైరస్ తరువాత జనాలకు సినిమా హాళ్ళకు ఎలా రప్పించాలన్నది అతి పెద్ద సవాల్ గా మారుతోంది. సినిమాల మీదనే బతుకుతున్న బడా కామందులు, ప్రముఖులు దీనికి పరిష్కారం కోసం ఇప్పటి నుంచే కాస్తా గట్టిగానే బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారుట.

 

ప్రముఖ నిర్మాత సురేష్ మూవీస్ అధినేత డి సురేష్ బాబు అయితే దీనికి మంచి ఆలోచనే చేస్తున్నాడు. ఆయన సినిమా హాళ్ళ టికెట్లు రేట్లు తగ్గించడం ద్వారానే జనాలను తిరిగి హాళ్ళకు రప్పించగలమని భావిస్తున్నారుట.

 

అంటే కరోనా వైరస్ తరువాత సినిమా హాళ్ళ టికెట్ ధరలు ఒక్కసారిగా నేలకు వస్తాయన్నమాట. ఇంతకు ముందే ఈ తెలివి ఉంటే అపుడే రేట్లు తగ్గిస్తే ఇంతటి సంక్షోభం వచ్చేది కాదు కదా. అయినా కరోనా దెబ్బకు అబ్బా అంటున్న వారిలో  సినిమా పెద్దలు చాలా అతి పెద్ద  ముఖ్యులుగా ఉన్నారు. 

 

మరి ఈ ఆలోచన అమలు చేస్తే బాగానే ఉంటుంది. కనీసం సగానికి సగం రేట్లు అయినా తగ్గిస్తేనే సినిమా హాలు వద్దకు జనం వచ్చేది. లేకపోతే ఎంతటి బొమ్మ అయినా ఇంట్లోనే చూసేస్తారు. ఇక సినిమాలు హాళ్ళలో ఆడవు,  అమెజాన్లోనో , మరో దాన్లోనో ఆడించుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: