కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తోంది. యావత్ దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. వ్యవస్థలన్నీ నిస్తేజం అయిపోయాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయిపోయారు. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీల వరకూ ఇళ్లోలోనే ఉంటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. వీరిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వెరైటీగా ఆలోచించింది. క్వారంటైన్ టైమ్ చాలెంజ్ అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొంతమంది సెలబ్రిటీలకు చాలెంజ్ కూడా విసిరింది.

 

 

ఈ వీడియోలో రకుల్ తలక్రిందులుగా గోడకు వేలాడుతూ నేలపై ఉన్న టీషర్టును వేసుకుంది. వివిధ వర్కౌట్స్ తో ఫిట్ గా ఉంటుంది కాబట్టే అలా కాళ్లను గోడ మీద ఉంచి.. చేతులను, బాడీని ఒక్కోటిగా బ్యాలన్స్ చేస్తూ టీషర్ట్ ను సునాయాసంగా వేసుకుంది. ఏమాత్రం చేతి పట్టు తప్పినా కింద పడిపోవడం, దెబ్బలు తగలటం ఖాయం. నిజానికి ఇది చాలా కష్టమైన ప్రక్రియ. యోగాలో, వర్కౌట్ లో ఒళ్లు తిరిగుంటేనే ఇది సాధ్యం. రకుల్ కు ఇవి వెన్నతో పెట్టిన విద్య. తాను చేసిన ఈ టీషర్ట్ చాలెంజ్ ను వీడియో తీసి తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అయింది.

 

 

రకుల్ విన్యాసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘క్వారంటైన్ టైమ్ లో మామూలుగా నిలబడడం నచ్చలేదు. అందుకే ఇలా తలకిందులుగా నుంచున్నాను. మీకోసం ఈ టాస్క్’ అంటూ ఛాలెంజ్ కూడా విసిరింది. ఈమధ్య ఇటువంటి చాలెంజ్ టాస్క్ లు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరి రకుల్ చేసిన ఈ ఫీట్ వైరల్ అవుతుందో లేదో చూడాలి. కెరీర్ పరంగా ప్రస్తుతం రకుల్ భారతీయుడు2 తోపాటు తెలుగులో నితిన్ తో ఓ సినిమా చేస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Was just bored of wearing my tee the normal way 😜😂 #quarantinelife #weekendchallenge So here a task for all of you to do.. it’s like a super elevated plank , amazing for your core. @anshukayoga @rhea_chakraborty @akansharanjankapoor I nominate u to take this up 💪🏻💪🏻 #strongisthenewsexy #strongereveryday

A post shared by rakul Singh (@rakulpreet) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: