మెగాస్టార్ చిరంజీవి సోదరుడైన మెగా బ్రదర్ నాగేంద్రబాబు మొదట్లో కొన్ని సినిమాల్లో అక్కడక్కడా చిన్న పాత్రల్లో నటించడంతో పాటు మధ్యలో హీరోగా కూడా నటించడం జరిగింది. ఇక నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించిన నాగబాబు ఆపై తన తల్లి అంజనాదేవి పేరు పై మీద అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో పలు హిట్ సినిమాలను తీయడం జరిగింది. అయితే వాటిలో కొన్ని హిట్ సాధించగా మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. ఆపై రామ్ చరణ్ తో ఆయన తీసిన ఆరెంజ్ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయి నాగబాబుకు ఆర్ధికంగా కూడా పెద్ద సమస్యలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత మెల్లగా సినిమా నిర్మాణం నుండి విరామం తీసుకున్న నాగబాబు, ఆపై ఈటీవీ ఛానల్లో ప్రసారమైన జబర్దస్త్ షోలో జడ్జిగా చేరడం జరిగింది. 

 

ఇక ఆ తర్వాత నుండి ఆ షో లో ఎంతో పాపులర్ అయిన నాగబాబు దాదాపుగా ఏళ్లకుపైగా అదే షోలో జడ్జిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ షో నుంచి ఇటీవల బయటకు వచ్చి నాగబాబు, ప్రస్తుతం జీ తెలుగులో అదిరింది అనే షోకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడే అలవాటున్న నాగబాబు, ఇటీవల సొంతంగా తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పలు సినీ, రాజకీయ అంశాలపై ముక్కుసూటిగా తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు. ఇక నేడు ఆ ఛానల్ లో నాగబాబు మాట్లాడుతూ, ఇటీవల కొందరు అభిమానులు తనను రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ గురించి మీ అభిప్రాయాన్ని తెలపమని కామెంట్ చేయడం జరిగిందని అన్నారు. 

 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు, ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో రిలీజ్ అయిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియో చూశానని, అది ఎంతో అదిరిపోయిందని, తప్పకుండా రాజమౌళి గారు తీస్తున్న ఈ సినిమా ఇప్పటివరకు ఉన్న సినిమాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి అత్యద్భుత విజయాన్ని అందుకుంటుందని నమ్మకం తనకు ఉందని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ మొత్తానికి మంచి బూస్ట్ నిచ్చేలా నాగబాబు మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేశారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: