టాలీవుడ్ లో కింగ్ నాగార్జున గా, మన్మధుడి గా ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్స్ ని అందుకొని సీనియర్ జూనియర్ హీరోలకి బాగా పోటీ ఇచ్చారు. ఎక్స్‌పరిమెంట్స్ చేయడం లో నాగార్జున తర్వాతే ఏ హీరోయినా అన్న టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. అంతేకాదు కొత్త దర్శకులకి అవకాశాలు ఇవ్వడంతో యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం లో నాగార్జున అందరికంటే ముందుంటాడు. నాగార్జున అలా అవకాశాలు ఇవ్వకపోతే ఈ రోజు ఇండస్ట్రీలో రాం గోపాల్ వర్మ, రాఘవ లారెన్స్ లాంటి దర్శకులు ఉండే వారు కాదు. అన్నపూర్ణ నిర్మాణ సంస్థలో ఎన్నో ప్రయోగాలు చేశారూ ... చేస్తూనే ఉన్నారు. 

 

అలాగే ఈ నిర్మాణ సంస్థ ద్వారా దర్శకులు, సంగీత దర్శకులు, నటీ నటులు, ఇతర టెక్నీషియన్స్ ఎంతో మంది ఇండస్ట్రీకొచ్చి సెటిలయ్యారు. అయితే గత కొంతకాలంగా నాగార్జున నటించిన సినిమాలన్ని వరుసబెట్టి ఫ్లాపవుతున్నాయి. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా తర్వాత మళ్ళీ సక్సస్ ని అందుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన రాజుగారి గది 2, నేచురల్ స్టార్ నాని తో కలిసి నటించిన దేవదాసు, సినిమాలు చేసినప్పటికి ఆ సినిమాలు ఫ్లాప్స్ గా మిగిలాయి. ఇక మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి బ్యూటీతో రొమాన్స్ చేసినప్పటికి ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. 

అంతేకాదు ఈ ఏజ్ లో ఇలాంటి సినిమాలేంటి అన్న నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఇది నాగార్జున కి బాగా బ్యాడ్ సినిమా అన్న టాక్ కూడా వచ్చింది. అంతేకాదు ఈ మధ్యలో వచ్చిన ఆఫీసర్ కూడా నిరాశపరచింది. శివ కాంబినేషన్ రిపీట్ అయినప్పటికి ఒక్క షో తో సినిమా భారీ డిజాస్టర్ అని తేల్చేశారు జనం. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర అన్న సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇది కాకుండా టాలీవుడ్ లో మరో సారి పోలీస్ పాత్రలో ఒక సినిమా చేస్తున్నారు.

 

అయితే నాగార్జున ఇక నిర్మాతగా సెటిలయితే బావుంటుందన్న టాక్ మొదలైంది. నాగచైతన్య, అఖిల్ ల తో సినిమాలు నిర్మిస్తూ ఏదైనా తన ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ వచ్చినప్పుడు చేస్తే బావుంటుందేమో అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నాగార్జున ఫ్యాన్స్ మాత్రం ఇంకా నాగార్జున నుంచి సినిమాలు ఆశిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: