ఎన్టీఆర్ బయోపిక్, రూలర్ సినిమాల షాక్ తో ఈసారి కొడితే బాక్సాఫీస్ బద్దలవ్వాలని డిసైడ్ అయ్యి మరి బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ రెండు సినిమాలు హిట్ అందుకున్నాయి. ఇక హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ మూవీ మరో హిట్ అయ్యేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తారని తెలుస్తుంది,

 

ఒక పాత్రలో బాలయ్య బాబు అఘోరా లుక్ లో కనిపిస్తాడని టాక్ వచ్చింది. అందుకే బాలయ్య ఈమధ్య విగ్ లేకుండా కనిపిస్తున్నాడు. ఇక ఇదిలాఉంటే ఈ సినిమాలో బాలకృష్ణకు బాలకృష్ణే విలన్ అంటున్నారు. హీరో నేనే విలన్ కూడా కూడా నేనే అంటున్నాడు బాలయ్య బాబు. అఘోరా లుక్ తో విలన్ గా నటిస్తున్నారట బాలయ్య బాబు. హీరోలే విలన్ అయ్యే సందర్భాలు చాలా తక్కువ. ఒకే సినిమాలో హీరోనే విలన్ అది కూడా డ్యూయల్ రోల్ చేయడం అంటే అదో పెద్ద సాహసమే. 

 

ఎప్పుడు ప్రయోగాలకు ముందడుగు వేసే బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా కోసం విలన్ గా కూడా నటిస్తున్నాడట. హీరోకి ఏమాత్రం తీసి పోనీ విధంగా విలన్ పాత్ర ఉంటుంది. ముందుగా ఈ పాత్రకు ఒకరిద్దరిని అనుకోగా హీరోనే విలన్ గా చేస్తే వెరైటీగా ఉంటుందని భావించి ఇలా ఫిక్స్ చేశారట. అయితే దీనికి సంబందించిన పూర్తి డీటైల్స్ తెలియాల్సి ఉంది.  ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ పాత్రల్లో నందమూరి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు కానీ లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారని బాలకృష్ణ సరసన నటింపచేస్తున్నారని తెలుస్తుంది. సింహాలో బాలకృష్ణకు జోడిగా నటించింది నయనతార.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: