రేణు దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా అందరికి సుపరిచితమే. మోడలింగ్ రంగంలో నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ తర్వాత తమిళంలో ‘జేమ్స్ పాండూ' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగులో పవన్ కళ్యాణ్‌తో చేసిన ఫస్ట్ సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ‘బద్రీ’ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసిన నటించిన రేణూ పవన్‌తో తొలి పరిచయంతోనే ప్రేమలో పడింది. పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ దాదాపు తొమ్మిదేళ్ల పాటు సహజీవనం చేశారు. అంతేకాదు, ఆ సమయంలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో వీళ్లిద్దరూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయారు. ఆ సమయంలోనే ఈ జంట అగ్నిసాక్షిగా అకీరా నందన్ సమక్షంలో ఒక్కటైంది. ఆ తర్వాత వీళ్లకు ఓ పాప కూడా జన్మించింది. 

 

అయితే చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ల కాపురంలో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండగా, రేణుదేశాయ్‌ సినిమా వైపు అడుగులు వేశారు. పవన్‌తో విడాకుల తర్వాత ఆమె ‘ఇష్క్ వాలా లవ్' అనే మరాఠి మూవీతో నిర్మాత కమ్ దర్శకురాలిగా మారింది. అంతేకాదు, కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పని చేసింది. కొన్ని సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్రవేసింది రేణూ దేశాయ్. పవన్‌తో విడిపోయిన తర్వాత పిల్లలతో కలిసి పూణేలో నివాసం ఉంటోంది. కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు, అతడితో నిశ్చితార్థం కూడా జరుపుకున్నట్లు ఫొటోలు వదిలారు. అయితే, ఆ తర్వాత ఏమైందో ఏమో ఆమె పెళ్లి గురించి మాట్లాడలేదు. 


గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణూ దేశాయ్... సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ వస్తోంది. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వస్తోంది. ఈ మధ్య కరోనా వైరస్ గురించి జాగ్రత్తలు చెప్తూ ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. తాజాగా తన కుమారుడు అకీరా నందన్ 16వ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టి అందర్నీ భావోద్వేగానికి గురిచేసింది. రేణు దేశాయ్ తాజాగా క్వారంటైన్ టైములో తన కొడుకును ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. తన కుమారుడు అకీరాతో పాటు పెట్ డాగ్ ఫీబో కిటీకీ దగ్గర నుంచి బయటకు చూస్తున్న ఫొటోలను షేర్ చేసిన ఆమె... ‘ఫీబో, అకీరా ఇంటి నుంచి పారిపోవాలని చూస్తున్నారు' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్‌కు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

. Please swipe ➡️ for the human version😂 . Feebo and akira, both searching for ways to escape from home🤣🤣🤣 . #quarantinelife #frustrated #stayhome #catsofinstagram #catsarecrazy #quarantinefunny #needtorun #phonephotography #shotoniphone #catphotography #picoftheday

A post shared by renu desai (@renuudesai) on

మరింత సమాచారం తెలుసుకోండి: