కరోనా ప్రభావంతో ప్రపంచమంతా తన ఆలోచనా విధానం మార్చకుంటుంది. పాశ్చాత్య దేశాలు కూడా విచ్చలవిడి తాన్ని పక్కన పెట్టిసే భారతీయ పద్ధతులను అలవాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ రంగం మీద కూడా ఈ ప్రభావం తీవ్రంగా కనిపించనుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక మనిషి మర మనిషిని తాకడానికి కూడా భయపడుతున్నాడు. అలాంటిది ఇక మీదట బాలీవుడ్‌ లో ఇంటిమేట్ సీన్స్ ఎలా తెరకెక్కిస్తారు.

 

ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాన్స్ ఓ రేంజ్‌లో చూపిస్తున్నారు. అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు కూడా భారీగా వస్తున్నాయి. ఇలాంటి సినిమాలు తెరకెక్కించాలంటే నటీనటుల మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. లిప్‌ లాక్‌లు కూడా అదరగొడతాయి. మరి ఇక మీదట ఇలాంటి సీన్స్‌లో నటించేందుకు తారలు అంగీకరిస్తారా..? లిప్‌ లాక్‌ చేసేందుకు ముందుకు వస్తారా..?

 

ఈ విషయంపై పలువురు దర్శకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ పరిస్థితుల తరువాత కొంత కాలం పాటు ఇంటిమేట్ సీన్స్‌ తెరకెక్కించటంలో చీట్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్‌ అవలంభించాల్సి ఉంటుంది. అంటే 60, 70లలో తరహాలో ముద్దు సన్నివేశం కనిపించ కూడా ఏదైన ప్రాపర్టీ అడ్డు తీసుకురావటం, లేదా ఆ సన్నివేశాలను వెనక నుంచి తెరకెక్కించటం లాంటివి చేస్తారు అని పీకు దర్శకుడు సూజిత్ సర్కార్ అభిప్రాయపడ్డాడు.

 

ఈ విషయం నటి దియా మీర్చా కూడా స్పందించారు. ఆమె అభిప్రాయం ప్రకారం `సినిమా మేకింగ్ అనేదే ఎక్కువ మంది జనం కలిసి చేయాల్సి పని. క్రూ మొత్తం మాస్క్‌ లు, గ్లౌస్‌లతో పనిచేస్తారా..? అది సాధ్యమేనా..? కాలమే నిర్ణయించాలి` అని చెప్పింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

“Intimate scenes “

A post shared by Shoojit Sircar (@shoojitsircar) on

మరింత సమాచారం తెలుసుకోండి: