కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్న తరుణంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంకా మందు కనుగొనబడని కరోనా వైరస్ ని ఎదుర్కోవాలంటే, ఇళ్ల నుండి బయటకి రాకపోవడం ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తున్నందున ఆ నిర్ణయమే తీసుకుంది ప్రభుత్వం. అయితే లాక్డౌన్ వల్ల అన్ని పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి. ప్రతీ పరిశ్రమ ఆర్థికంగా చాలా నష్టపోయింది.

 

 

దీనికి సినిమా పరిశ్రమ కూడా అతీతం కాదు. అయితే సాధారణ సమయంలో హీరోయిన్లు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా కనిపించేవారు. హాట్ హాట్ ఫోటోలతో పిచ్చెక్కించేవారు. రోజుకో ఫోటో చొప్పున్న అభిమానులకి మత్తెక్కించేవారు. అయితే లాక్డౌన్ వేల ఇళ్లకే పరిమితమైన హీరోయిన్లలో చాలా మంది అసలు ఫోటోలే పెట్టట్లేదు. ఇంటి దగ్గరే ఉండి ఏ పనీ లేకున్నా కూడా ఫోటోలు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు.

 

 

అయితే ఇలా ఫోటోలు పెట్టకపోవడం వెనక పెద్ద కారణమే ఉందని అంటున్నారు. మామూలుగా హీరోయిన్లు బయటకి వెళ్లాలంటే మేకప్ ఖచ్చితంగా వేసుకుంటారు. మేకప్ లేకుండా బయటకి వెళ్లే సమస్యే లేదు. ఇక ఫోటోషూట్ అంటే ఎంత మేకప్ వేసుకుంటారో అందరికీ తెలుసు. ఆ మేకప్ వల్లే వాళ్ళు అంత అందంగా కనిపిస్తారు. మేకప్ లేకుండా హీరోయిన్లు బయటకి రారు. కనిపించరు కూడా.

 

 

అందువల్లే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టట్లేదని అంటున్నారు. ఇంట్లో ఉంటే మేకప్ అవడ కష్టం కాబట్టి అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఒక్కసారి లాక్డౌన్ పూర్తయ్యాక మళ్ళీ మేకప్ తో విర్రవీగిపోతారని అంటున్నారు. లాక్డౌన్ కాలంలో ఎవరైతే సొషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేయకుండా ఉన్నారో వారే లాక్దౌన్ పూర్తయిన వెంటనే కుప్పల కొద్దీ ఫోటోలు అప్లోడ్ చేస్తారని, ఆ టైమ్ లోనే వారి రంగు బయటపడుతుందని అంటున్నారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: