బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్‌ కాజోల్‌ సోషల్ మీడియాలో అరుదైన ఘనత సాధించింది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు ఏకంగా 10 మిలియన్ల ( కోటి మంది) ఫాలోవర్స్‌ మార్క్‌ను అందుకుంది. ఈ సందర్భంగా శనివారం ఆమె తన ఇన్‌స్టా పేజ్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. తనపై ఈ స్థాయిలో ప్రేమాభిమానులు చూపిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేసింది.

 

`నా రీల్‌ అండ్ రియల్‌ లైఫ్‌లో నన్ను నన్నుగా అభిమానిస్తున్న అందరికీ కృతజ్ఞతలు` అంటూ కామెంట్ చేసింది కాజోల్. ఈ కామెంట్‌తో పాటు కబీ ఖుసీ కబీ గమ్ సినిమాలో తను చేసిన ఓ డ్యాన్స్ క్లిప్‌ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ద్వారా తను ఈ ఘనతను ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తుందో అభిమానులకు అర్ధం అయ్యేలా చూపించింది కాజోల్‌.

 

ఇక సినిమాల విషయానికి వస్తే కాజోల్‌ చివరగా ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన దేవీ అనే షార్ట్ ఫిలింలో కనిపించింది. ఈ షార్ట్ ఫిలిం ద్వారా ఆమె ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇటీవల అజయ్‌ దేవగన్ హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం తానాజీలోనూ నటించింది. ఆమె రియల్‌ లైఫ్‌ కపుల్‌ అయిన అజయ్‌, కాజోల్‌ లో ఈ సినిమాలోనూ భార్య భర్తలుగా నటించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

This is a shout out to my insta fam who have shown love to the reel and real me so much ❤️ ! Gratefully, yours kajol 😘

A post shared by kajol Devgan (@kajol) on

మరింత సమాచారం తెలుసుకోండి: