కెరియర్ మంచి జోష్ లో ఉన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే లాక్ డౌన్ పీరియడ్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడు షూటింగులతో బిజీగా గడిపే అమ్మడు కాస్త రిలాక్స్ గా ఇంట్లో ఉంటూ టైం పాస్ చేస్తుంది. ఇక తనలోని కొత్త టాలెంట్ తో అందరిని సర్ ప్రయిజ్ చేస్తుంది పూజా హెగ్డే. మొన్న హల్వా చేసి సూపర్ అంటూ లొట్టలేసుకుంటూ తిన్న పూజా లేటెస్ట్ గా పిజ్జా ట్రై చేసినట్టు తెలుస్తుంది. ఎప్పుడు తినడమే కానీ చేయడం అలవాటు లేని అమ్మడు తన మదర్ సాయంతో ఇప్పుడు తనకు తానె స్వయంగా చేసుకుంటూ తింటుందట. 

 

లాక్ డౌన్ ఎత్తేసే టైం కు పూజా ఒక రెస్టారెంట్ తెరిచేలా ఉందని నెటిజెన్ల కామెంట్ చేస్తున్నారు. తెలుగులో వరుస హిట్లతో దూసుకెళ్తున్న పూజా హెగ్డే క్వారెంటైన్ పిరియడ్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తుందని అనిపిస్తుంది. అమ్మడు చేయడమే కాదు చేసిన ప్రతి ఐటం తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు చూపిస్తూ ఊరిస్తుంది. పిజ్జా టెస్ట్ అదిరింది.. ఎప్పుడు అమ్మ చేసే పిజ్జా ఈసారి తాను ట్రై చేశానని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. 

 

ఇక అమ్మడి రాబోయే సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ తో ఒక సినిమా సెట్స్ మీద ఉండగా. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న అఖిల్ సినిమాపై పూజా హెగ్డే చాలా హోప్స్ పెట్టుకుంది. ఈమధ్య అమ్మడు చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ పై వరుస హిట్లు కొడుతుండగా అఖిల్ కు పూజా లాక్ కలిసి వచ్చి మొదటి హిట్ పడటం ఖాయమని అంటున్నారు.       

      

 

మరింత సమాచారం తెలుసుకోండి: