పెళ్ళి హడావిడి మధ్య బిజీగా ఉండవలసిన నితిన్ కరోనా దెబ్బతో ప్రస్తుతం ఖాళీగా ఉంటూ రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం ఏర్పడిన లాక్ డౌన్ పరిస్థితులు తనను ఏవిధంగా బద్ధకస్తుడుగా మార్చేసాయో నితిన్ వివరంగా వివరించాడు. 


రెగ్యులర్ షూటింగ్ లు లేకపోవడంతో తన ఇంటిలోని జిమ్ వైపు చూడటం కూడ మానేసానని దీనికితోడు లాక్ డౌన్ వల్ల తన ఇంటికి జిమ్ కోచ్ కూడ రాకపోవడంతో ఒక్కడినే జిమ్ చేయాలంటే బద్ధకం వేసి జిమ్ వైపు వెళ్ళడం మానేసాను అని అంటున్నాడు. ఇక తన తల్లితో తనకు నచ్చిన వంటలు అన్నీ చేయించుకుంటూ ప్రతిరోజు తన అమ్మ చేసిన వంటలతో పాటు హ్యాపీగా అన్నం పప్పు ఆవకాయ ఆమ్లెట్ దొరికినన్ని స్వీట్స్ తింటున్న తనను చూసి తన తల్లి ఆశ్చర్యపడుతున్నట్లు నితిన్ బయటపెట్టాడు. 


ఇక ఏమి చేసే పనిలేక అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫ్లామ్స్ లో అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు కనీసం రోజుకు మూడు చూస్తూ అర్దరాత్రి 2 గంటల వరకు మేలుకుంటూ ఉదయం 11 గంటలకు నిద్ర లేస్తున్న తన తీరులో వచ్చిన మార్పులు చూసి రేపు తిరిగి షూటింగ్ లు ప్రారంభం అయ్యాక నీపరిస్థితి ఏమిటి అంటూ తన తల్లి తనతో చేసిన జోక్ ను బయటపెట్టాడు. ప్రతిరోజు కనీసం 20 సార్లు చేతులు కడుకుంటున్న తన పరిస్థితి చూసి తనకే నవ్వు వస్తోందని తనలో వచ్చిన ఈవిపరీతమైన మార్పుల పై తనకు తానే జోక్స్ వేసుకున్నాడు నితిన్.


అయితే డబ్బులు పోతే మళ్ళీ సంపాధించుకోవచ్చు సినిమాలు ఫెయిల్ అయితే ఏదోవిధంగా మళ్ళీ హిట్ చేసుకోవచ్చు అసలు మనమంటూ ఉంటేనే కదా సినిమాలు అంటూ కరోనా పై వేదాంతం మాట్లాడుతున్నాడు నితిన్. దీనితోపాటు తన అభిమానులకు సందేశం ఇస్తూ ‘హీరోలకన్నా ప్రాణమే మిన్న’ అన్న వాస్తవాన్ని గుర్తించండి అంటూ నితిన్ ఒక స్లోగన్ ఇస్తున్నాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: