దేశంలో కరోనా పై యుద్దం చేస్తున్న విషయం తెలిసిందే.  గత నెల 24  నుంచి లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందే.  ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది.  వాణిజ్య వ్యవస్థ నానా ఇబ్బందులు పడుతుంది.  అయితే సోషల్ మాద్యం నేపథ్యంలో ఇద్దరు ప్రముఖుల మాటల యుద్దం సాగుతుంది.  గత కొన్ని రోజులుగా మెగాబ్రదర్ నాగబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.  2014లోనే తాము పొత్తులు పెట్టుకోలేదని, పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించారని వివరించారు.

 

చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవని విమర్శించారు. పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చిందంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసం ప్యాకేజి తీసుకుని పుట్టిన పార్టీ అది. రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఎవరి కోసం తోక ఊపుతూ మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసు. అలాంటి పార్టీతో మేం పొత్తు పెట్టుకుంటామని కలేమైనా కన్నారా? పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల చిత్తుగా ఓడిపోతాడని అందరికీ ముందే తెలుసు  అంటూ   ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

తాాజాగా ఈ విషయంపై నాగ బాబు స్పందించారు.  తాము సాధారణమైన వ్యక్తులం అని, తాము సినిమాలు, టీవీ షోలు చేయకపోతే కుటుంబాలను పోషించుకోలేమని తెలిపారు.   అవార్డులు అందుకోగల పారిశ్రామికవేత్తలను జైలు పాలుచేసింది ఇదంతా తమరి గొప్పతనమే అన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: