కొంతమంది హీరోయిన్స్ అందం అభినయం రెండూ ఉన్నా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాని పొందలేరు. నటించిన ఫస్ట్ సినిమా హిట్ తో అవకాశాలు అందిపుచ్చుకుంది కానీ సక్సెస్ కాలేకపోయింది. స్టార్‌ హీరోల సరసన నటించింది కానీ.. స్టార్‌ కాలేకపోయింది. అందం ఉంది కానీ అదృష్టం లేకుండా పోయింది. ఈ హీరోయిన్‌ ఎవరో ఈ పాటికే అర్ధమై ఉంటుంది. ఆమె ఎవరో కాదు అందరూ ముద్దుగా అనూ బేబీ అని పిలిపించుకునే అను ఇమ్మాన్యుయేల్...తెలుగులో నాని హీరోగా వచ్చిన 'మజ్ను' సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా స్టార్‌ హీరోల పక్కన అవకాశాలను తెచ్చిపెట్టింది కానీ.. సక్సెస్‌ను మాత్రం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘అజ్ఞాతవాసి’ సినిమా చేసింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రావాల్సినంత గుర్తింపు రాలేదు ఈ భామకు. ఆ తర్వాత అల్లు అర్జున్ “నా పేరు సూర్య” సినిమాతో మరో డిజాస్టర్‌ను అందుకుంది. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'ఆక్సిజెన్' చిత్రాలలో నటించినా ఏ  చిత్రామూ ఆడలేదు. దాంతో ఆమె కెరీర్ అయోమయంలో పడింది. తెలుగులో మరో ప్రయత్నంగా నాగచైతన్యతో 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం ద్వారా ముందుకొచ్చింది. కానీ ఈసారి కూడా పరాజయమే వెక్కిరించింది ఈ బేబీకి. ఇక తమిళంలో ఆమె నటించిన 'తుప్పారివాల‌న్‌' తెలుగులో 'డిటెక్టివ్'గా వచ్చింది. ఆ సినిమా తెలుగులో మంచి హిట్ గా నిలిచింది. అందం అభినయం ఉన్నా కానీ ఏం లాభం.. అదృష్టం లేకుండా పోయింది. టాలీవుడ్‌‌లో అవకాశాలు తగ్గినప్పటికీ ఈ భామ ఇప్పుడు కోలీవుడ్‌‌లో మాత్రం బిజీగానే ఉంది. మళ్లీ టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఆమెను అవకాశాలు వరిస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'అల్లుడు అదుర్స్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. 

 

IHG

 

ఇదిలా ఉండగా స్టార్ హీరోల సరసన నటించినా కూడా మీకు ఈ గ్యాప్‌ రావడానికి కారణం ఏమిటని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అనూ బేబీని అడిగితే ఆసక్తికరంగా సమాధానమిచ్చిందట. 'నేను ఈ రంగంలోకి వచ్చిన కొత్తల్లో ఎలాంటి కథలు ఎంచుకోవాలో నాకు తెలిసేది కాదు. దాంతో కొద్దిగా తడబడిన మాట వాస్తవమే. దానికితోడు నాకు కథ చెప్పడానికి వచ్చినవారు నా పాత్ర మాత్రమే చెప్పేవారు. సినిమా కథేమిటో నాకు తెలిసేది కాదు. ఏమీ తెలియకుండానే సినిమా చేసేదాన్ని. దాంతో ఆ సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ఇక నుంచి అలాంటి తప్పులు చేయదలుచుకోలేదు. పూర్తి స్ర్కిప్టుతో వస్తేనే సినిమా చేయాలని అనుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చేవారికి అదే చెబుతున్నాను. అలా వచ్చినవారి కథలే వింటున్నాను. మిగతా వారిని మర్యాదగానే తిప్పి పంపిస్తున్నాను' అని అను ఇమ్మాన్యుయేల్ తెలిపిందట. మరి ఇప్పటికైనా మంచి మంచి అవకాశాలు అనూ బేబీ తలుపు కొడతాయేమో చూడాలి. అయితేనేం సోషల్ మీడియాలో అందాలను బహిర్గతం చేసే ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచేస్తోంది అను. ఇదిలా ఉండగా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: