అనుష్క‌.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన ఈ బ్యూటి ఎన్నో విజ‌యాల‌ను అందుకుంది. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ఏర్ప‌ర్చుకుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ఈ జేజమ్మ.. ప్రస్తుతం నిశ్శబ్దం చిత్రంలో న‌టిస్తుంది. ఇదిలా ఉంటే.. అనుష్క పాత స‌రికొత్త రికార్డులు సృష్టించింది. అదే రుద్రమదేవి. అనుష్క రుద్ర‌మ‌దేవి ఇప్పుడు రికార్డులు సృష్టించ‌డం ఏంటీ..? అనేగా మీ సందేహాలు.

 

భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్‌ దర్శకుడి, నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఒకే సారి తెలుగు, తమిళ్‌, మలయాళంతో పాటు హిందీలో కూడా విడుదల అయింది. అయితే అనుష్క మెయిన్ లీడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు రానా లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మన తెలుగులో మొట్టమొదటి స్టీరియో స్కోపిక్ 3డి సినిమాగా ఇది తెరకెక్కి ఒక కొత్త అనుభూతిని అందించింది. ఇక ఈ చిత్రంలో అనుష్క రెండు విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తుంది. అందులో ఒకటి వీరనారిగా అయితే రెండోది గ్లామరస్‌ ప్రిన్సెస్‌.

 

అయితే  2015లో వచ్చిన ఈ సినిమా తెలుగులో అంతంత మాత్రంగానే ఆడింది.  కానీ హిందీ వెర్షన్‌ అదరగొడుతుంది. ఈ సినిమాలో గోనగన్నా రెడ్డిగా కనిపించిన బన్నీ ఈ సినిమాకు హైలైట్ అని చెప్పాలి. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్ లో 125 మిలియన్ మార్కును అందుకుంది. దీంతో ఆ విషయాన్ని గుణశేఖర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కాగా, ప్ర‌స్తుతం అక్కడ ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తోంది. ఏదేమైనా 2015లో వ‌చ్చిన రుద్రమదేవి ఇప్పుడు రికార్ట్ క్రియేట్ చిత్రం టీమ్‌తో పాటు అనుష్క సైతం హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: