స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాచురల్ స్టార్ నాని లాంటి టాలీవుడ్ బడా హీరోల సరసన హీరోయిన్ గా నటించే ఆఫర్లను అతి తక్కువ సమయంలోనే చేజిక్కించుకున్న అను ఇమ్మానియేల్ ప్రస్తుతం అంతూ పంతూ లేకుండా కనుమరుగవుతుంది. మజ్ను సినిమా తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈమె పవన్ కళ్యాణ్ తో జతకట్టి అజ్ఞాతవాసి సినిమాలో తళుక్కుమంది. కానీ ఆ సినిమా ఆల్ టైమ్ డిజాస్టర్ గా పేరు తెచ్చుకోవడంతో ఆమె క్రేజ్ అమాంతం దిగజారింది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో అల్లు అర్జున్ సరసన రొమాన్స్ చేసిన అను మళ్లీ ఓ భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది.


దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఆమెకు సినిమా అవకాశాలన్నీ సన్నగిల్లి పోయాయి. దాంతో టాలీవుడ్ కి మకాం మార్చింది కానీ అక్కడ కొంత మంది దర్శకులతో గొడవ పెట్టుకుని మళ్ళీ టాలీవుడ్ పరిశ్రమలో కే అడుగు పెట్టింది. ఆ తర్వాత నాగచైతన్య సరసన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటించి మరో ఆల్టైమ్ డిజాస్టర్ సినిమా ని తన ఖాతాలో వేసుకుని డిజాస్టర్ కా మాత అనే అరుదైన, అప్రదిష్ట మైన బిరుదుని సంపాదించుకుంది. అయితే తాజాగా ఆమె నటించిన ప్రతి సినిమా అట్టర్ ఫ్లాప్ అవడానికి గల కారణం ఏంటని ఓ ఇంటర్వ్యూ అడగగా... ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


ఆమె మాట్లాడుతూ... ' నేను సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు... ఏ కథను ఎన్నుకోవాలో నాకు బొత్తిగా అవగాహన లేక పోయింది. ఆ సమయంలో ఏ సినిమా అవకాశం వస్తే ఆ సినిమాకి ఓకే చెప్పేశాను. ప్రతి సినిమా డైరెక్టర్ మా వద్దకు వచ్చినప్పుడు కేవలం నా భాగమైన స్క్రిప్టును మాత్రమే వినిపించేవాడు. దాంతో నాకు నేను చేస్తున్న సినిమా దేని గురించి కూడా తెలియకుండా అసలు ఏ అవగాహన కూడా లేకుండా నటించే దాన్ని. అందుకే ఆ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ గా మిగిలి పోయాయి. కానీ నేను చేస్తున్న పెద్ద తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక నుంచి సినిమా యొక్క పూర్తి స్క్రిప్టుని విని... సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకుంటాను' అని ఆమె చెప్పుకొచ్చింది.


ప్రస్తుతం అను ఇమ్మానియేల్ బెల్లంకొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లుడు అదుర్స్ సినిమాలో ద్వితీయ కథానాయికగా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: